‘సలార్‘ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ప్రభాస్

ఒక సినిమా విడుదలకు ముందు.. ఆ చిత్రబృందం చేసే ప్రచార సందడి మామూలుగా ఉండదు. భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాల విషయంలో మరింత ఎక్కువగా ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ‘సలార్‘ అందుకు భిన్నం. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ వంటివి జరగలేదు. సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల ముందు రాజమౌళితో ‘సలార్‘ టీమ్ ఓ స్పెషల్ ఇంటర్యూ మాత్రమే చేసింది. అయినా.. ‘సలార్‘ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది.

వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.700 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ త్వరలో స్పానిష్, జపనీష్ లాంగ్వేజెస్ లోనూ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక.. రిలీజ్ తర్వాత ఇప్పటివరకూ బయట కనిపించని ‘సలార్‘ టీమ్ అంతా ఒకే వేదికపై సందడి చేశారు. బ్లాక్ బస్టర్ సలార్ పేరుతో కేక్ ను కట్ చేసి.. తమ సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్ తో పాటు.. పృథ్వీరాజ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఈ సెలబ్రేషన్స్ లో సందడి చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

Related Posts