సంక్రాంతి కానుకగా రానున్న ప్రభాస్ ఫస్ట్ లుక్

ఈమధ్య వరుసగా యాక్షన్ మూవీస్ తో అభిమానుల్ని అలరిస్తున్న రెబెల్ స్టార్ ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో సినిమా కోసం మళ్లీ డార్లింగ్ గా మారబోతున్నాడు. రొమాన్స్ తో పాటు.. హిలేరియస్ కామెడీతోనూ ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. ఈ సినిమా చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. ఈ ఏడాదే థియేటర్స్ లోకి దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక.. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేసేందుకు టైమ్ ఫిక్సయ్యింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతోన్న ప్రభాస్-మారుతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ను.. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఉదయం 7 గంటల 8 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. సంక్రాంతి సమరాన్ని తెలిపేలా ఓ కోడి బొమ్మతో వదిలిన ఈ పోస్టర్ లో.. ‘ప్రభాస్ ది వింటేజ్ డార్లింగ్ రైజింగ్ ఆన్‘ అంటూ టైటిల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. మొత్తంగా.. ‘సలార్‘తో సూపర్ ఫామ్ లోకి వచ్చిన డార్లింగ్.. ఇదే ఏడాది ‘కల్కి 2898 ఎ.డి‘తో పాటు.. మారుతి మూవీతోనూ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు.

Related Posts