‘హనుమాన్‘ ఫస్ట్ డే కలెక్షన్స్

కంటెంట్ ఉంటే చాలు సినిమా పెద్దదా, చిన్నదా అనే ఆలోచించరు ఆడియన్స్. ఆ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటారు. ఇప్పుడు ‘హనుమాన్‘ విషయంలో అదే జరుగుతుంది. బడా స్టార్స్ నటించే సినిమాలకు అడ్డాగా చెప్పుకునే సంక్రాంతి బరిలో ఎంతో సాహసం చేసి రంగంలోకి దిగింది ‘హనుమాన్‘. థియేటర్ల విషయంలో ఎన్నో సర్దుబాట్లు జరిగాయి. చివరకు చిన్న సినిమా అయినా.. కంటెంట్ బలంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సూపర్ హీరో మూవీ.

ఈ రేంజ్ బడ్జెట్ లో.. ఎంతో హై క్వాలిటీ విజువల్స్ తో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందిస్తోన్న ‘హనుమాన్‘ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఈ సినిమా తొలిరోజు దాదాపు 12 కోట్లు వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇంకా.. కలెక్షన్స్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఓవర్సీస్ లోనూ ఈ సినిమా దూసుకుపోతుంది. అక్కడ అప్పుడే హాఫ్ మిలియన్ డాలర్స్ మార్కును దాటేసింది.

మరోవైపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాం థియేట్రికల్ రైట్స్‌ను రూ.7.5 కోట్లకు దక్కించుకోగా.. సీడెడ్ రూ.4 కోట్లు, ఆంధ్రా రూ.10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. హిందీ సర్కిల్స్ లోనూ ‘హనుమాన్‘ బాగా పికప్ అవుతోంది. ఈ లెక్కన మరో రెండు రోజుల్లోనే ‘హనుమాన్‘ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

Related Posts