ఫస్ట్ ఎలిమినేషన్ కిరణ్ రాథోడ్ ..

తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 సందడి మొదలైంది. ఈ సీజన్ నాగార్జున చెప్పినట్టుగానే కాస్త బెటర్ గా ఉంది. కంటెస్టెంట్స్ అందరూ స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఒకరిని మించి ఒకరు దూకుడు చూపే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్ కోర్స్ ప్రతి సీజన్ లో ఉన్నట్టే ఏడుపులు పెడబొబ్బలు పెట్టేవాళ్లు.. అంతా తాము చెప్పినట్టే వినాలి అనుకునే హాట్ టోన్ వాళ్లు అందరూ ఉన్నారు. అయితే ఒక్కరు మాత్రమే అసలే సౌండ్ చేయకుండా ఉన్నారు. అది మరెవరో కాదు.. కిరణ్‌ రాథోడ్. ఒకప్పుడు హీరోయిన్ గా సౌత్ లోని అన్ని భాషల్లో ఒక వెలుగు వెలిగింది కిరణ్. ఏజ్ బార్ అవడంతో హీరోయిన్ గా ఆఫర్స్ తగ్గాయి. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో తన ఇమేజ్ ను దాటి.. ఇంకా చెబితే ఉల్లూ వెబ్ సిరీస్ ల హీరోయిన్ల ఇమేజ్ కు దిగి ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తోంది. అలా ఎందుకు చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. అలాగని తను ఆ బి గ్రేడ్ సిరీస్ లలో కూడా నటించలేదు. అలాంటి తనను ఈ సీజన్ కు సెలెక్ట్ చేయడమే ఆశ్చర్యం. అనూహ్యం. సరే సడెన్ గా వచ్చిన ఈ అవకాశాన్ని తను ఉపయోగించుకుంటుందా అంటే అస్సలు లేదు.


లేటెస్ట్ గా నాగార్జున ప్రోమో చూస్తే ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ కిరణ్‌ రాథోడ్ అని దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 14మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. బట్ నాగ్ మాత్రం కేవలం 13మందిని మాత్రమే తను గుర్తిస్తున్నా అని ఆ 14వ వ్యక్తి కిరణ్‌ రాథోడ్ అని.. ఇంగ్లీష్ తప్ప వేరే భాష తెలియని ఆమె హౌస్ లో ఎలాంటి సందడి చేయడం లేదని చెప్పాడు. నిజానికి ఇది ఆడియన్స్ కూడా అనుకుంటున్నదే. అసలు కిరణ్ హౌస్ లో ఉందా అనే డౌట్ చాలామందిలో ఉంది. అంత కామ్ గా ఉంది. బిగ్ బాస్ అంటేనే కాస్త లౌడ్ గా ఉండాలి. డామినేట్ చేయాలి. వాయిస్ పెంచాలి. అవసరమైతే ఏ గొడవకైనా రెడీ అనేలా ఉండాలి.. ఇంకా చెబితే గొడవలు పెట్టుకోవాలి కూడా. బట్ వీటిలో ఒక్కటి కూడా చేయడం లేదు కిరణ్‌ రాథోడ్. అందుకే ఆమె ఎలిమినేషన్ గ్యారెంటీ అంటున్నారు.


బట్.. బిగ్ బాస్ లో ట్విస్ట్ లు ఉంటాయి. మనం ఫలానా వాళ్లు ఎలిమినేట్ అవుతారు అనుకుంటే వారిని కాదని ఊహించిన వ్యక్తులను ఓటింగ్ పడలేదు అనే కారణంతో బయటికి పంపించిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి సందర్భం ఈసారి కూడా ఎదురైతే తప్ప.. కిరణ్‌ రాథోస్ సేఫ్‌ కాదు. లేదంటే ఈ హౌస్ ఫార్మాట్ కు అస్సలే మాత్రం సూట్ కాని తను ఖచ్చితంగా వెళ్లిపోవడం గ్యారెంటీ.. అది ఈ ప్రోమోతో చెప్పకనే చెప్పాడు నాగార్జున.

Related Posts