Featured

విడాకుల లాయర్ .. పవన్ కళ్యాణ్‌ అభిమానే

ఈ మధ్య కాలంలో మోస్ట్ ఎక్స్ పెక్టెడ్ డివోర్స్ అంటే నిహారిక, చైతన్యదే అని చెప్పాలి. 2020లో ఈ ఇద్దరూ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. నాగబాబు కూతురుగా నిహారిక తనదైన గుర్తింపు తెచ్చుకుంది.

అప్పటిక ఒక సినిమాలో హీరోయిన్ గా చేసింది. వెబ్ సిరీస్ లో నటించింది. అయితే చైతన్య జొన్నలగడ్డతో తను ప్రేమలో పడ్డానని, పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పింది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు ఈ జంట హ్యాపీగానే ఉంది.

అయితే గతేడాది ఓ పబ్ లో జరిగిన రైడ్స్ లో డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చింది. అందులో నిహారిక పేరు కూడా వినిపించింది. తను డ్రగ్స్ తీసుకుందా లేదా అనేది.. ఆ కేస్ లో తను లేదు అనేది కూడా క్లియర్ గా ఎవరికీ తెలియదు. పోలీస్ లు కూడా తన పేరు ఉందని చెప్పలేదు.

అప్పటి నుంచే వీరి మధ్య మనస్ఫర్థలు మొదలయ్యాయి అంటారు. ఆ తర్వాత కొంతకాలం కామ్ గానే ఉన్నా.. ఈ యేడాది ఆరంభంలో ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ”అన్ ఫ్రెండ్” చేసుకున్నారు. ఫోటోస్ డిలీట్ చేసుకున్నారు.

ఆల్రెడీ ఇది సమంత విషయంలో జనాలకు అనుభవంలో ఉంది కాబట్టి.. ఇక వీరు కూడా విడిపోతున్నారు అనే భావించారు. అనుకున్నట్టుగానే ఈ మంగళవారం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్ట్ వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ విడాకులు వెనుక కీలకంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్‌ అభిమాని.. జనసేన కార్యకర్త.. లాయర్ దిలప్ కుమార్ సుంకర కావడం విశేషం.


పవన్ కళ్యాణ్‌ అభిమానిగా జనాలకు పరిచయం అయ్యాడు దిలీప్ కుమార్ సుంకర. ఆ టైమ్ లో అనేక గొడవలకు సంబంధించి సామరస్యం చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యాడు. తర్వాత తను లా చదువుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అతని ప్రాక్టీస్ బావుందనే చెబుతారు చాలామంది. మరోవైపు జనసేనకు సంబంధించి మొదట్లో దగ్గరగా ఉన్నా.. తర్వాత దూరమయ్యాడు. రీసెంట్ గా మళ్లీ యాక్టివ్ అయ్యాడు.

ఈ మొత్తంలో నాగబాబు చొరవ ఉందీ అని చెబుతారు. మెగా ఫ్యామిలీలో అతనికి నాగబాబుతోనే ఎక్కువ చనువు, సాన్నిహిత్యం ఉన్నాయనేది జనసేన వర్గాలు చెప్పే మాట. ఆ సాన్నిహిత్యంతోనే కూతురు విడాకులు కేస్ ను అతనికి ఇచ్చాడు. వారు కోరుకున్నది చేసి పెట్టేందుకు ఓ లాయర్ గా తను చేయాల్సింది చేసి పెట్టాడు దిలీప్.

అది అతని వృత్తి ధర్మం కూడా. కాకపోతే మెగా అభిమానిగా అతను ఇది చేయడం వల్ల ఎక్కువ హైలట్ అవుతున్నాడు. ఆ ప్లేస్ లో ఎవరున్నా అదే చేస్తారు. అంతెందుకు.. మెగా అభిమాని కాబట్టి.. అతను చెబితే.. నిహారిక, చైతన్య కాంప్రమైజ్ కారు కదా..? సో.. ఇది అతని ప్రొఫెషన్. దట్సాల్.

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

9 mins ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

30 mins ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

47 mins ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

57 mins ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

6 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

7 hours ago