Featured

ఎన్టీఆర్ కి భారతరత్న రావాలని ఆకాంక్షించిన చిరంజీవి

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన వారికి భారతరత్న ప్రదానం చేస్తారు. ఇక.. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటడమే కాకుండా.. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన నటుడు, రాజకీయ నాయకుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ ఎలాంటి వారో.. తమిళులకు అలాంటి ఆరాధ్యుడు ఎమ్.జి.ఆర్. ఎమ్.జి.రామచంద్రన్ చనిపోయిన తర్వాత ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చారు. అలాగే తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కి కూడా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఈమధ్య మరింత జోరందుకుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న తర్వాత చిరంజీవి.. ఎన్టీఆర్ కి భారతరత్న రావాలని తాను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. ఎమ్.జి.ఆర్ గారికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారికి కూడా రావటం ఎంతో సముచితం, ఆనందదాయకం.. తాను ఆ తరుణం కోసం ఎదురుచూస్తున్నట్టు చిరంజీవి తెలిపారు.

Telugu70mm

Recent Posts

ప్రభాస్ కి ప్రతినాయకుడిగా కొరియన్ యాక్టర్

ప్రభాస్ పట్టిందల్లా బంగారంలా మారుతుంది. రెబెల్ స్టార్ నుంచి సినిమా వస్తే.. కలెక్షన్ల సునామీ ఖాయం. అయితే.. ఒక సినిమా…

31 mins ago

మరోసారి హాట్ టాపిక్కైన ‘హనుమాన్’ క్యారెక్టర్

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ సీక్వెల్స్ లో 'జై హనుమాన్' ఒకటి.…

1 hour ago

ట్రైలర్ తో అంచనాలు పెంచిన ‘డార్లింగ్’

'డార్లింగ్' ప్రభాస్ సినిమా టైటిల్ తో రూపొందుతోన్న ప్రియదర్శి చిత్రం 'డార్లింగ్'. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్…

2 hours ago

Global star completed the ‘Game Changer’.

The film 'Game Changer' is being made by global star Ram Charan and director Shankar.…

21 hours ago

‘Kalki’ looted Rs.800 crore worldwide

Even as it enters the tenth day, the 'Kalki' collections continue to flourish all over…

21 hours ago

రామ్-సంజయ్ దత్ పోరాటానికి ఇక 40 రోజులే..!

సినిమాల సంఖ్యా పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ, స్టార్ స్టేటస్ పరంగానూ, బిజినెస్ పరంగానూ ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా…

22 hours ago