కామెడీ కింగ్ బ్రహ్మానందంకు బర్త్ డే విషెస్

నవ్వేవాడు భోగి.. నవ్వించేవాడు యోగి – అన్నారు పెద్దలు. తెలుగువారిని మూడున్నర దశాబ్దాలకు పైగా నవ్విస్తున్న యోగి బ్రహ్మానందం. ఆయన నవ్వుల పువ్వుల గుబాళింపుల్లో ప్రేక్షకలోకం ఈ నాటికీ పరవశించి పోతూనే ఉంది. ఫిబ్రవరి 1న నవ్వుల రారాజు బ్రహ్మానందం పుట్టినరోజు.

అత్తిలిలో అధ్యాపకునిగా తెలుగు పాఠాలు బోధించిన బ్రహ్మానందం, ‘తాతావతారం’తో వెండితెరపై తళుక్కుమన్నాడు. ఆపైన బ్రహ్మానందంలోని హాస్యం లాస్యం చేస్తూ జంధ్యాలను ఆకట్టుకుంది. ఇంకేముంది అక్కడ నుండీ అయ్యవారు కాస్తా ముఖానికి రంగేసుకొని కెమెరాముందు నిలవడంలో బిజీ అయిపోయాడు. ‘అహ నా పెళ్ళంట’లో అరగుండుతో అదరహో అనిపించాడు బ్రహ్మానందం. ‘ఆహా నా పెళ్లంట’ సినిమా త‌ర్వాత‌.. బ్ర‌హ్మ‌నందం అవ‌కాశాల‌కు అకాశ‌మే హ‌ద్ద‌యింది. జంధ్యాల ఏం మంత్రించి ఆయ‌న్ను ఇండ‌స్ట్రీలోకి వ‌దిలారో.. బ్ర‌హ్మానందం కామెడీకి టాలీవుడ్ అంత‌లా అడిక్ట్ అయిపోయింది. తెలుగునాట ఏళ్ల త‌ర‌బ‌డి హాస్య‌పు సేద్యాన్ని చేస్తూ.. న‌వ్వులు పండిస్తూనే ఉన్నాడు బ్రహ్మానందం.

తెరపై బ్రహ్మానందం కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేయాల్సిందే. బ్రహ్మానందం కాల్ షీట్ కమెడియన్స్ లోనే అతి కాస్ట్లీ. అయినప్పటికీ ఆ కాల్ షీట్సే కాసులు కురిపిస్తాయని నమ్మేవారు నిర్మాతలు. అలా.. ఎన్నో సినిమాలు బ్రహ్మానందం కామెడీయే ప్రధాన బలంగా బ్లాక్ బస్టర్స్ సాధించాయి.
టాప్ హీరోస్ మొదలు అప్ కమింగ్ హీరోస్ దాకా అందరి చిత్రాల్లోనూ బ్రహ్మానందం కనిపించాలని ప్రేక్షకులు కోరుకుంటుంటారు. బ్రహ్మానందం తమ చిత్రాల్లో ఉంటే చాలు, ఫలితం పరమానందం కలిగిస్తుందనీ నిర్మాతలు, దర్శకులు భావిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే బ్రహ్మానందం తన కామెడీలో మొనాటనీ లేకుండా చూసుకుంటూ ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉన్నాడు.

తెలుగులో రేలంగి, అల్లు రామలింగయ్య తరువాత ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న హాస్యనటునిగా బ్రహ్మానందం చరిత్ర కెక్కాడు. కేవలం 20 ఏళ్ళ కాలంలో 750కి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకూ వేయికి పైగా చిత్రాల్లో నవ్వులు పూయించారు కామెడీ కింగ్ బ్రహ్మానందం. తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు పెట్టించిన బ్రహ్మానందం.. ఇప్పుడు సినిమాలను బాగా తగ్గించాడు. హార్ట్ ఆపరేషన్ తర్వాత ఆచితూచి నటిస్తున్నాడు.

Related Posts