జాతీయ అవార్డుల కోసం వెళ్లిన తెలుగు సినిమాలు

69వ జాతీయ అవార్డులలో తెలుగు సినిమాలు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ‘ఆర్.ఆర్.ఆర్, పుష్ప’ సినిమాలు అవార్డుల వర్షం కురిపించాయి. ఉత్తమ నటుడిగా ‘పుష్ప’ చిత్రానికి గానూ అల్లు అర్జున్ ఎంపికై.. దశాబ్దాల తెలుగు కథానాయకుల కలను సాకారం చేశాడు. ఇక.. 70వ జాతీయ పురస్కారాలకు సంబంధించిన సందడి మొదలవ్వబోతుంది. ఈ ఏడాది ప్రకటించనున్న జాతీయ అవార్డుల కోసం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి దాదాపు 20 సినిమాలను పంపించారట.

2022లో విడుదలై.. 70వ జాతీయ అవార్డుల కోసం పంపించబడిన సినిమాల జాబితాలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, రవితేజ ‘ధమాకా’, నాని ‘అంటే సుందరానికి’, రానా ‘విరాటపర్వం’, నిఖిల్ ‘కార్తికేయ 2’ వంటి సినిమాలతో పాటు.. ‘సీతారామం, యశోద, ఇట్లు మారేడుమిల్లి, అశోక వనంలో అర్జున కళ్యాణం’ వంటి సినిమాలున్నాయి. వీటిలో ‘కార్తికేయ 2, సీతారామం, యశోద, విరాటపర్వం’ వంటి సినిమాలకు పలు కేటగిరీల్లో అవార్డులు వస్తాయనే అంచనాలున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ‘బింబిసార, కార్తికేయ 2’ చిత్రాలకు ఖచ్చితంగా అవార్డులు వస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Related Posts