శివ పార్వతులుగా ప్రభాస్, నయన్

బిగ్ న్యూస్.. శివ పార్వతులుగా ప్రభాస్, నయనతా నటించబోతున్నారు. కాకపోతే ఇంకా కన్ఫార్మ్ కాలేదు. బట్ ఈ వార్త చూడ్డానికి ఎంత బావుంది అనిపిస్తోంది కదా.. ఈ న్యూస్ బయటకు వచ్చిన దగ్గర్నుంచీ నిజమైతే బావుండు అనుకుంటున్నారు అభిమానులు. ఆల్రెడీ ప్రభాస్ అయితే ఫిక్స్. నయనతార మాత్రమే ఓకే చెప్పాల్సి ఉంది. ఇక ఈ న్యూస్ ను బట్టి చూస్తే ఇది ఏ సినిమా కోసమో ఇట్టే పసిగట్టొచ్చు.

యస్.. మంచు విష్ణు రూపొందించబోతోన్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియన్ మూవీ కన్నప్ప కోసమే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీని అఫీషియల్ గా ప్రారంభించాడు విష్ణు. అప్పుడు హీరోయిన్ గా నూపుర్ సనన్ ను తీసుకున్నాడు. కానీ తను డేట్స్ అడ్జెస్ట్ అవడం లేదు అనే కారణంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దానికి ముందే ఈ మూవీలో శివుడుగా నటించేందుకు ప్రభాస్ ను ఒప్పించాడు విష్ణు. ఈ విషయాన్ని విష్ణు చెప్పాడు కానీ.. ప్రభాస్ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు.


ఇక ఈ చిత్రంలో పార్వతి పాత్ర కోసం నయనతారను అప్రోచ్ అవుతున్నాడట విష్ణు. ఆల్రెడీ ఈ తరహా దేవత పాత్రలు చేసి ఉంది నయన్. తెలుగు శ్రీ రామరాజ్యంలో సీతగా నటించింది. ఆ మధ్య తమిళ్ లో వచ్చిన ఓ మూవీలో దేవత పాత్రలో కనిపించింది. తను ఓకే అంటే అందరికంటే ఎక్కువ లాభం కలిగేది మంచు విష్ణుకే. ఇప్పటికే ప్రభాస్ ఎంట్రీ వల్ల ఈ ప్రాజెక్ట్ కు తిరుగులేని వెయిట్ వచ్చింది. ఇక నయన్ కూడా ఎస్ అంటే చెప్పేదేముందీ. ఆ జోడీ అదిరిపోతుంది. సినిమా ఎక్కడికో పోతుంది.


ఇక ప్రభాస్, నయనతార జంటగా ఓ పదిహేనేళ్ల క్రితం యోగి అనే సినిమా వచ్చింది. వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కన్నడ యోగి చిత్రానికి రీమేక్. అక్కడ బిగ్గెస్ట్ హిట్. ఇక్కడ ఫ్లాప్. ఆ తర్వాత మళ్లీ ప్రభాస్, నయనతార జోడీ కట్టలేదు. అదీ ఈ సినిమాతో రిపీట్ అయితే ఫ్యాన్స్ కు కన్నుల పండగే.

Related Posts