దేవతలు ముంచిన గంధర్వుల కథ వస్తోంది

పురాణ కథలను వెలికి తీస్తే మన వద్ద వందల కథలు పుట్టుకువస్తాయి. కాకపోతే ఈ కథ ఉద్దేశ్యంఏంటీ అనేదాన్ని బట్టి కొందరి మనోభావాలు కూడా ఆధారపడి ఉంటాయి. వాటిని హర్ట్ చేయకుండా కాస్త కమర్సియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుని మంచి కథనం కూడా రాసుకుంటే కమర్షియల్ గా సూపర్ హిట్ కొట్టడం ఈజీ. పైగా ఇప్పుడు బడ్జెట్ పెరిగినా ప్రాబ్లమ్ లేకుండా ప్యాన్ ఇండియన్ మార్కెట్ కూడా తోడైంది. అందుకే మళయాలం నుంచి ఓ ప్రయత్నం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ దేవతలు, రాక్షసులు అని మాత్రమే చదువుకున్నాం.. చూశాం.. చూస్తున్నాం. ఈ సారి దేవతల వల్ల అణచివేయబడిన వీరాధి వీరులు, మహా అందగాళ్లు అయిన గంధర్వుల కథ వస్తోంది. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా రాబోతోన్న ఈచిత్రంలో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్ర చేయబోతున్నాడు. తెలుగులో గంధర్వుడు జూనియర్ అనే టైటిల్ పెట్టారు. లేటెస్ట్ గా ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.


“దేవతలు.. ప్రతక్ష్యంగానూ అవతారాల ద్వారానూ చేసిన యుద్ధాలు ఈనాటికీ కొనియాడబడుతున్నాయి. ఆ యుద్ధాల్లో గంధర్వులు దేవతలకు తోడుగా నిలిచిన కథలు మరుగున పడిపోయాయి. గంధర్వులు పోరాట పటిమ, తమతో సమానంగా అందచందాలను చూసి దేవతలు అసూయ పడుతున్నట్టు అన్ని లోకాలూ అభివర్ణించడంతో దేవతలు భయపడిపోయారు. ఇటువంటి గంధర్వుల యుద్ధ పరాక్రమాలు, సర్వలోకాల వారి మనసుల నుంచి చరిత్ర నుంచి దేవతల వలన చెరిపివేయబడ్డాయి. ఈ ప్రపంచంము, ఆ చరిత్ర గంధర్వుల అందాన్ని, సంగీత జ్ఞానాన్ని వర్ణిచడం మొదలుపెట్టాయి. కాలం వాటిని కొనసాగించింది. వాటితో పాటు యుగాలకు ఇటు వైపు ఆ గంధర్వ పురాణం మళ్లీ సృష్టించబడింది.. ఇంత వరకూ మనం చెప్పుకున్నది పురాణాల గురించి. ఇక మనం చూడబోయేది.. ఒక గంధర్వ వీరుని కావ్య కథ..” అంటూ వాయిస్ పై వచ్చిన విజువల్స్ అన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి.


ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో విష్ణు అరవింద్ డైరెక్ట్ చేయబోతోన్న ఈ చిత్రాన్ని లిటిల్ బిగ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సువిన్ కే వర్కీ, ప్రశోభ్ కృష్ణ నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం చేస్తున్నాడు. మరి ఈ దేవతల గురించిన కొన్ని అంశాలున్నాయి కాబట్టి.. ఈ మూవీ వల్ల కొందరివి దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు.

Related Posts