గ్రౌండ్ ఫ్లో బలిసిందా బే

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. ఈ దసరా సందర్బంగా అక్టోబర్ 19న విడుదల కాబోతోన్న ఈ మూవీ నుంచి ఓ సర్ ప్రైజింగ్ వీడియో విడుదల చేశాడు అనిల్ రావిపూడి. ఈ విషయం ఒక రోజు ముందే చెప్పాడు. దీంతో అందరూ వీడియోలో ఏం ఉంటుందా అని ఆసక్తిగా చూశారు. కొన్నాళ్లుగా ఈ మూవీ విడుదల విషయంలో వినిపిస్తోన్న అనుమానాలకు చెక్ పెడుతూ.. తమ షూటింగ్ పూర్తయిందీ అన్న విషయం చెబుతూ.. ఈ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ముహూర్తం షాట్ నుంచి గుమ్మడికాయ కొట్టే వరకూ కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి.


పాసినేట్ క్రూ, 24 అద్భుతమైన లొకేషన్స్, 12 భారీ సెట్స్.. 8 నెలల పాటు సాగిన ఇంటెన్స్ షూటింగ్ పూర్తయింది అంటూ ఈ వీడియోలో కొన్ని కీలక ఘట్టాలను చూపించారు. ఇక ఈ వీడియో ఒక్కటే వస్తే అనిల్ రావిపూడి స్పెషల్ ఏం ఉంటుంది. అందుకే బాలయ్యపై చిత్రీకరించిన ఒక డైలాగ్ ను కూడా చూపించాడు. ఆయన కెమెరాను చూస్తూ.. ” కలిసి మాట్లాడతా అన్నా గదా.. ఇంతలోనే మందిని పంపాలా.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే.. ” అంటూ చెప్పిన డైలాగ్ తో పాటు.. చివర్ లో.. బ్రో.. ఐ డోంట్ కేర్ అన్న డైలాగ్ ఆకట్టుకున్నాయి.


ఇక ఈ విజువల్స్ చూస్తుంటే బాలయ్యను ఫస్ట్ టైమ్ ఓ కొత్త కోణంలో చూపించబోతున్నాడు దర్శకులు అనేలా ఉంది. అలాగే దసరా రిలీజ్ అనే రూమర్స్ కు కూడా చెక్ పెడుతూ అక్టోబర్ 19న విడుదల అని మరోసారి స్ఫష్టం చేశారు. సెట్స్, విజువల్స్ మరో స్థాయిలో కనిపిస్తున్నాయి. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఇప్పటి వరకూ ఉన్న బాలయ్య సినిమాలకు భిన్నంగా, ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టున్నారు.


బాలయ్య తో పాటు ఓ కీలక పాత్రలో శ్రీ లీల నటించిన ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ లో కాజల్ అగర్వాల్ చేసింది. విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కనిపిస్తున్నాడు. మొత్తంగా కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ చాలా బావుందన్న టాక్ తెచ్చుకుంది. గణేష్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. మరి ఈ దసరాకు బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టేలానే ఉన్నట్టున్నాడు.

Related Posts