ఆపరేషన్ వాలెంటైన్ కు అదిరే డీల్

హీరోలు ఫ్లాపుల్లో ఉంటే మార్కెట్ మైనస్ లోకి వెళుతుంది. బట్ కొన్నిసార్లు మాత్రం అనూహ్యంగా పెరుగుతుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమా అంటే మెగా ఫ్యాన్స్ లోనే జోష్ కనిపించడం లేదు. ఆ రేంజ్ లో బ్యాక్ టు బ్యాక్ షాక్ లు ఇచ్చాడు వరుణ్. రీసెంట్ గా వచ్చిన గాండీవధారి అర్జున డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. మళ్లీ ఒక బ్లాక్ బస్టర్ పడితే అంతా సెట్ అయిపోతుంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. అందులో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్, రెండోది మట్కా. మట్కాకు ఇంకా చాలా టైమ్ ఉంది. బట్ ఆపరేషన్ వాలెంటైన్ మాత్రం ఎప్పుడో స్టార్ట్ అయింది. ఈ డిసెంబర్ 8న విడుదల కాబోతోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా అనే అతను డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అనూహ్యమైన బిజినెస్ డీల్స్ జరిగాయి. ఇది ఇండస్ట్రీని సైతం ఆశ్చర్యపరుస్తోంది.


ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ వార్ మూవీ అని చిత్ర టీమ్ ప్రచారం చేస్తోంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పైలెట్ గా కనిపించబోతున్నాడు. అతని లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెలుగులోనే కాదు.. ఇండియాలోనే తక్కువ సినిమాలున్నాయి. అందువల్ల ఇది మన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందనే అనుకోవచ్చు. పైగా ఒరిజినల్ ఇన్సిడెంట్స్ అంటున్నారు కాబట్టి దేశభక్తి కూడా కనిపిస్తుంది. వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ గా భారీ డీల్ సెట్ అయింది.


ఆపరేషన్ వాలెంటైన్ కు దేశవ్యాప్తంగా నాన్ థియేట్రికల్ రైట్స్ 50 కోట్లకు డీల్ సెట్ అయింది. ఇందులోనే ఓటిటి, శాటిలైట్ తో పాటు ఆడియో రైట్స్ కూడా ఉన్నాయి. ఓ రకంగా ఇప్పుడు వరుణ్ తేజ్ ఉన్న పరిస్థితికి ఇది చాలా పెద్ద డీల్ అనే చెప్పాలి. సినిమా బడ్జెట్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి థియేట్రికల్ గా వీరికి పెద్ద సమస్యేం ఉండకపోవచ్చు. మొత్తంగా రెండు వరుస డిజాస్టర్స్ తర్వాత వరుణ్ తేజ్ భారీ డీల్ కొట్టాడు అంటే ఆపరేషన్ వాలెంటైన్ పై నమ్మకం పెట్టుకోవచ్చేమో.

Related Posts