యానిమల్ టీజర్ ఎలా ఉంది

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రూపొందిన సినిమా యానిమల్. రణ్ బీర్ కపూర్, రష్మికమందన్నా జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న విడదల కాబోతోంది. అర్జున్ రెడ్డితో తెలుగులో ఓవర్ నైట్ ఫేమ్ అయిన సందీప్ ఆ చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడా బ్లాక్ బస్టర్ అందుకుని మరో సినిమాను అక్కడే చేస్తున్నాడు. ఇదే యానిమల్. కొన్నాళ్ల క్రితం విడుదలైన యానిమల్ గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ టీజర్ మరో స్థాయిలో ఉందని ప్రశంసలు అందుకుంటోంది.


చిన్నప్పటి నుంచి కొడుకును సరిగా అర్థం చేసుకోకుండా విచక్షణా రహితంగా కొట్టే తండ్రి.. అయినా తండ్రంటే చాలా ఇష్టం పెంచుకున్న కొడుకు. ఇక తను ప్రేమించిన అమ్మాయి తమకు పిల్లలు కలిగితే అతన్ని అతని తండ్రిలా ఉండొద్దు అంటే ఆమెపై కోప్పడతాడు. తనను ఏదైనా అడగొచ్చని.. కానీ తండ్రి విషయం కాదని ఖచ్చితంగా చెబుతాడు. ఇక తండ్రి తప్పు తెలుసుకుని సారీ చెబితే .. దాన్ని కొట్టి పడేస్తాడు. అంతలోనే సడెన్ గా రూపం మారిపోతుంది. ఓ పెద్ద డాన్ లా కనిపిస్తాడు. చుట్టూ మనుషులు, గన్స్, బాడీ గార్డ్స్.. ఓ కొత్త లైఫ్ లోకి ఎంటర్ అవుతాడు. అదేంటంటే.. తనే చెబుతాడు..


” నేను చెడును వెంటాడుతూ వెళ్లాను. నాకెక్కడా కనబళ్లేదు. నాలో నేను చూసుకున్నాను. నాకన్నా చెడ్డవాడు లేడు..” అంటాడు. అతను ఓ పెద్ద నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. చెడును వెదికే క్రమంలో అక్కడ అందర్నీ అంతం చేశాడు. ఆ క్రమంలో తనూ గాయాల పాలయ్యాడు. అప్పుడు తన తండ్రిని ఉద్దేశించి.. ” నాన్నా.. ఇది ఇప్పుడే మొదలైంది నాన్నా.. ఇంకా చాలా పనుంది. నేను వాడ్ని కలవాలి. చంపాలి. మీరు నిరాశపడకండి నాన్నా.. ” అనే డైలాగ్ ను బట్టి చూస్తే అసలు విలన్ వేరే ఉన్నారని తెలుస్తుంది. ఆ విలన్ పాత్రలో బాబీ డియోల్ నటించాడు. చివర్లో అతని ఎంట్రీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో.. ఈ యానిమల్ వేట ఆ విలన్ ను చంపేందుకే అని అర్థం అవుతుంది.


ఇక ఈ మూవీలో రణ్ బీర్ సింగ్ ఓ ఫిజిక్స్ లెక్చరర్ అని.. అతని తండ్రి గ్యాంగ్ స్టర్ అనీ.. తండ్రిని ఎవరో చంపేస్తే తను గ్యాంగ్ స్టర్ గా మారి పగ తీర్చుకుంటాడు అనేది ముందు నుంచీ వినిపించిందే ఈ టీజర్ లోనూ కనిపిస్తోంది. మరి ఈ మొత్తాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా ఇంకెంత ఎంటర్టైనింగ్ గా చెప్పబోతున్నాడు అనేదాన్ని బట్టి యానిమల్ విజయం ఆధారపడి ఉంటుంది.

Related Posts