అశోక్ గల్లా కొత్త సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’

‘హీరో’ సినిమాతో హీరోగా పరిచయమైన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ఇప్పుడు రెండో సినిమాతో రెడీ అవుతున్నాడు. ఇప్పటివరకూ ‘అశోక్ గల్లా 2’ వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకి టైటిల్ ఖరారైయ్యింది. ఈ చిత్రానికి ‘దేవకీ నందన వాసుదేవ’ అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టారు. ‘గుణ 369’తో కమర్షియల్ క్వాలిటీస్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అర్జున్ జంధ్యాల ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్ గా ‘దేవకీ నందన వాసుదేవ’ టైటిల్ రివీల్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసింది టీమ్.

టీజర్ చూస్తే.. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కినట్టు తెలుస్తోంది. టీజర్ లో మాస్ లుక్ లో మెప్పిస్తున్నాడు అశోక్. అతనికి జోడీగా మానస వారణాసి కనిపించబోతుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నాడు. ఇంకా.. టాప్ టెక్నీషియన్స్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలో ‘దేవకీ నందన వాసుదేవ’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts