ప్రభాస్ విడుదల చేసిన ‘ది గోట్ లైఫ్’ ఫస్ట్ లుక్

‘సలార్’ సినిమాలో ప్రభాస్ కి దీటైన పాత్రలో అలరించాడు మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. లేటెస్ట్ గా పృథ్వీరాజ్ నటించిన ‘ది గోట్ లైఫ్’ ఫస్ట్ లుక్ ను ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా లాంఛ్ చేశాడు. పృథ్వీరాజ్ రస్టిక్ లుక్ తో ‘ది గోట్ లైఫ్.. ఆడు జీవితం’ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా ‘ది గోట్ లైఫ్’ తెరకెక్కుతోంది. పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా ఇదే. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందిస్తున్నారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ మేకోవర్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయనుందట. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్ గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ విడుదలైన ఐదు రోజులకే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ‘ది గోట్ లైఫ్’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts