‘బ్రహ్మ ఆనందం‘.. తాత మనవళ్లుగా మారిన తండ్రీకొడుకులు

పద్మశ్రీ బ్రహ్మానందం ఈమధ్య సినిమాల స్పీడు తగ్గించినా.. ప్రాధాన్యత గల పాత్రలొస్తే నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని చెబుతూనే ఉన్నారు. ఇక.. బ్రహ్మీ ఇప్పుడు తన తనయుడు గౌతమ్ తో కలిసి ‘బ్రహ్మ ఆనందం‘ సినిమా చేయబోతున్నాడు. అయితే.. ఈ తండ్రీకొడుకులిద్దరూ ఈ మూవీలో తాత మనవళ్లుగా నటిస్తుండడం విశేషం. బ్రహ్మానందం, గౌతమ్, వెన్నెల కిషోర్.. ఓ ఫన్నీ వీడియో ద్వారా ఇదే విషయాన్ని తెలుపుతూ ‘బ్రహ్మ ఆనందం‘ మూవీ అనౌన్స్ మెంట్ చేసింది టీమ్. ఈ సినిమాలో బ్రహ్మ గా గౌతమ్ నటిస్తుంటే.. ఆనందం గా బ్రహ్మానందం కనిపించబోతున్నాడు. వెన్నెల కిషోర్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్.వి.ఎస్. నిఖిల్ దర్శకుడు. శాండిల్య పీసపాటి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టుకోనున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతుంది.

Related Posts