‘మ్యాడ్‘ తర్వాత ‘మ్యాజిక్‘.. సితార కొత్త చిత్రం

యూత్ ఫుల్ కంటెంట్ కి ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. పోయినేడాది ‘మ్యాడ్‘ సినిమాతో అలాంటి విజయాన్నే అందుకుంది సితార ఎంటర్ టైన్ మెంట్స్. మరోసారి కొత్త వాళ్లతో యూత్ ఫుల్ థీమ్ తో సితార నిర్మించిన చిత్రం ‘మ్యాజిక్‘. ‘జెర్సీ‘ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అసలు ఎప్పుడు షూటింగ్ మొదలుపెట్టుకుందో తెలియకుండానే ‘మ్యాజిక్‘ సినిమాని ఓ మ్యాజిక్ లా కంప్లీట్ చేశారు నిర్మాత నాగవంశీ. త్వరలో జరగబోయే తమ కాలేజీ ఫెస్ట్ కోసం ఒక ఒరిజినల్ సాంగ్ ను కంపోజ్ చేయడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలు ఉంటాయంటోంది చిత్రబృందం. ఇక.. ఈ మ్యూజికల్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసేది మరెవరో కాదు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్. ఇంకా.. బడా బడా టెక్నీషియన్స్ వర్క్ చేస్తోన్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ వేసవిలోనే రాబోతుంది.

Related Posts