‘ఆదికేశవ’ మూవీలో జూనియర్ ఎన్.టి.ఆర్ సాంగ్..మాస్ స్టెప్పులతో అదరగొట్టిన శ్రీలీల..

తాజాగా థియేటర్స్‌లోకి వచ్చిన సినిమా ‘ఆదికేశవ’. ఈ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించారు. వైష్ణవ్ ఫైట్స్‌తో ఇరగదీస్తే శ్రీలీల తన డాన్స్‌తో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసింది. శ్రీలీల డాన్స్ కి మాస్ ఆడియన్స్ ఎంతగా కనెక్ట్ అయ్యారో ఇప్పటికే ‘ధమాకా’, ‘భగవంత్ కేసరి’ సినిమాలో పాటలు చూస్తే అర్థమవుతుంది. అలాగే, తాజా చిత్రం ‘ఆదికేశవ’ లో కూడా ‘లీలమ్మో’ సాంగ్ లో శ్రీలీల వేసిన స్టెప్స్ కి థియేటర్స్‌లో విజిల్స్ పడుతున్నాయి.

కుర్రాళ్ళంతా లేచి డాన్స్ చేస్తున్నారు. అంతేకాదు, జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ఇండస్ట్రీ హిట్ ‘సింహాద్రి’ సినిమాలోని ‘నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి’ పాటకి శ్రీలీల డాన్స్ అదరగొట్టింది. సేమ్ టు సేమ్ ఎన్.టి.ఆర్ స్టెప్పులేసినట్టుగానే శ్రీలీల కూడా తన డాన్స్ మూవ్‌మెంట్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Related Posts