‘పుష్ప 2’.. త్రిశూలాలతో తీర్చిదిద్దిన కొత్త పోస్టర్ అదుర్స్!

‘పుష్ప 2’ మాస్ జాతరకి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ‘పుష్ప 2’ నుంచి టీజర్ రాబోతుంది. టీజర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా.. ‘పుష్ప 2’లోని జాతర ఎపిసోడ్ కి సంబంధించిన విజువల్స్ తో టీజర్ రెడీ చేశాడట డైరెక్టర్ సుకుమార్. లేటెస్ట్ గా ‘పుష్ప 2’ నుంచి మరో పోస్టర్ రిలీజయ్యింది. చుట్టూరా త్రిశూలాలతో తీర్చిదిద్దిన ఈ పోస్టర్ అయితే కేక పుట్టిస్తుంది.

‘పుష్ప 2’ షూటింగ్ ప్రోగ్రెస్ విషయానికొస్తే.. మే నెలాఖరు వరకూ అల్లు అర్జున్ పార్ట్ షూటింగ్ పూర్తికానుందట. ఆ తర్వాత ప్యాచ్ వర్క్ తో మొత్తం సినిమా కంప్లీట్ కావడానికి జూన్ వరకూ అవుతుందని తెలుస్తోంది. అయితే.. ఈ సినిమాలో కొన్ని పాటల చిత్రీకరణ పూర్తైనా.. అసలుసిసలు ఐటెం నంబర్ మాత్రం ఇంకా చిత్రీకరణ పూర్తికాలేదట. త్వరలోనే ఆ స్పెషల్ నంబర్ ను తెరకెక్కించనున్నారట. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైమల్టేనియస్ గా పూర్తిచేసుకుంటున్న ‘పుష్ప 2’ ఆగస్టు 15న రావడం పక్కా అనే సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ స్టూడియోని సందర్శించాడు. అందుకు సంబంధించి ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Related Posts