‘ఫ్యామిలీ స్టార్’ యు.ఎస్.ఎ రివ్యూ

ఎక్కడా చూసినా విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ హంగామాయే కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ అంటేనే యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్. ముఖ్యంగా.. రొమాంటిక్ రోల్స్ తో అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నాడు విజయ్. ఇక.. కొన్ని సినిమాలుగా తన మేకోవర్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న విజయ్.. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరవుతున్నాడు. ఈసారి పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అనే విధంగా పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’తో వచ్చాడు.

మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలోకి వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాన్ని ఇప్పటికే కొంతమంది ప్రత్యేకమైన అతిథుల కోసం స్పెషల్ ప్రీమియర్స్ వేశారు. అలాగే.. అమెరికాలోనూ ప్రీమియర్స్ మొదలయ్యాయి. మరి.. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ ఫస్ట్ రిపోర్ట్ ఏంటి? ప్రేక్షకుల్ని ఏ రీతిన ఆకట్టుకుంటోంది?

ఇప్పటికే ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాన్ని హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు పరశురామ్ కుటుంబాల కోసం ప్రత్యేకమైన షో వేశారు. వాళ్లు అందించిన రిపోర్ట్ ప్రకారం.. సినిమా బ్లాక్ బస్టర్ అని తెలుస్తోంది. దిల్ రాజు భార్య తేజస్విని అయితే మంచి క్రిటిక్ అట. అలాంటిది ఆమె.. ‘ఫ్యామిలీ స్టార్’ చూసిన వెంటనే మీరు హిట్ కొట్టేశారండి అంటూ భర్త దిల్ రాజుతో చెప్పిందట. ఇదే విషయాన్ని లేటెస్ట్ గా తెలియజేశాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. అలాగే.. దిల్ రాజు కుమార్తె కూడా సినిమా ఫస్టాఫ్ చూడగానే.. ‘విజయ్ కిల్డ్ ఇట్ డాడీ’ అంటూ తన రివ్యూ చెప్పిందని దిల్ రాజు తెలిపాడు. విజయ్ దేవరకొండ తండ్రి గోవర్థన్, తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ‘ఫ్యామిలీ స్టార్’కి ఎంతో పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు.

ఇక.. యు.ఎస్.ఎ. రిపోర్ట్ విషయానికొస్తే.. గత చిత్రాల్లో చూడని విధంగా ఈ మూవీలో విజయ్ దేవరకొండ తనలోని హ్యూమర్ టచ్ ని చూపించాడట. ఫస్టాఫ్ మొత్తం కామెడీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు. విజయ్ దేవరకొండ కామెడీ టైమింగ్ బాగుందనే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అలాగే.. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో యాక్షన్ బ్లాక్స్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఆ సీక్వెన్సెస్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయంటున్నారు.

మృణాల్ ఠాకూర్ రోల్ చాలా డిజైన్ చేశాడట పరశురామ్. హీరోని ఏవండి అంటూ పిలిచే ఆమె స్టైల్ బాగుందట. ఇక.. సెకండాఫ్ ఎమోషనల్ గా సాగుతుందట. క్లైమాక్స్ అయితే చాలా ఇంప్రెస్సివ్ గా ఉందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. మరోవైపు.. మెగాస్టార్ చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ చిత్రానికి.. ‘ఫ్యామిలీ స్టార్’కి కొన్ని పోలికలు ఉన్నాయనే కంపారిజన్స్ వస్తున్నాయి. అయితే.. పరశురామ్ మాత్రం తన మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని ఎంతో ప్రత్యేకంగా తీసుకెళ్లాడనే కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి.

టెక్నికల్ గానూ ‘ఫ్యామిలీ స్టార్’ హై స్టాండార్డ్ లో ఉందని చెబుతున్నారు. పాటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. గోపీసుందర్ బి.జి.ఎమ్. కూడా విజయ్ ఎలివేషన్స్ ను బాగా హైలైట్ చేసిందనే ప్రశంసలు వస్తున్నాయి. ఓవరాల్ గా.. ‘ఫ్యామిలీ స్టార్’తో ఈ వేసవి బరిలో విజయ్ దేవరకొండ భారీ బ్లాక్ బస్టర్ కొడుతున్నాడనే రిపోర్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

Related Posts