డైనోసార్ ఆగమనానికి 50 రోజులు

పెద్ద డైనోసార్ ‘సలార్‘ ఆగమనానికి డిసెంబర్ మంత్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించడానికి ప్రభాస్ ‘సలార్‘ వచ్చేస్తుంది. అయితే.. లేటెస్ట్ గా ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తూ ‘సలార్ పార్ట్ 1.. సీజ్ ఫైర్‘ ఆగమనానికి మరో 50 రోజులు మాత్రమే అంటూ ఓ స్పెషల్ పోస్టర్ వదిలారు మేకర్స్.

‘బాహుబలి‘ సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ‘సలార్‘పైనే తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. అందుకు ప్రధాన కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ‘కె.జి.యఫ్‘ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రశాంత్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక.. ‘కె.జి.యఫ్‘కి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఈ చిత్రానికీ పనిచేస్తున్నారు. ‘కె.జి.యఫ్‘ నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్ నుంచే ‘సలార్‘ వస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ‘సలార్‘లో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తుంది. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇంకా.. జగపతిబాబు, టిను ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Posts