‘ఎన్.బి.కె. 109’ క్రేజీ అప్డేట్ కి ముహూర్తం ఫిక్స్

నేటితరం సీనియర్ హీరోలే కాదు.. యంగ్ హీరోస్ కు కూడా సాధ్యం కాని రీతిలో ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నటసింహం బాలకృష్ణ. ఇదే ఊపులో అప్ కమింగ్ మూవీ ‘ఎన్.బి.కె.109’తో మరో భారీ విజయాన్ని దక్కించుకునేందుకు రెడీ అవుతున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న బాలకృష్ణ 109వ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఎన్నికల తర్వాత బ్యాలెన్స్ వర్క్ పూర్తిచేసుకోనుంది. దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకున్న ‘ఎన్.బి.కె. 109’ మూవీ టైటిల్, హీరోయిన్, రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాలో బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి వంటి భారీ తారాగణమే ఉంది. అయితే.. బాలయ్యకి జోడీగా నటించే హీరోయిన్ ఎవరనేది తెలియలేదు. అలాగే.. టైటిల్ పైనా క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా.. ‘ఎన్.బి.కె. 109’ విడుదల ఎప్పుడు? అనేదే నందమూరి ఫ్యాన్స్ ను ఎంతో ఎగ్జైట్ చేస్తున్న విషయం.

ఈ అన్ని విషయాలపైనా క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట టీమ్. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు. ఆ సందర్భంగా.. జూన్ 4 నుంచే ‘ఎన్.బి.కె. 109’ నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయట. టైటిల్ తో పాటు.. ఈ సినిమాలో హీరోయిన్ విషయంపైనా క్లారిటీ రానుందట. అలాగే.. విడుదల తేదీపై కూడా ప్రకటన చేయనుందట టీమ్.

Related Posts