క్రేజీ లైనప్ తో రెడీ అవుతోన్న రామ్

గతేడాది ‘స్కంద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఈ సంవత్సరం ‘డబుల్ ఇస్మార్ట్’ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ ముంబైలో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటుంది. దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకున్న ‘డబుల్ ఇస్మార్ట్’ను త్వరలోనే విడుదలకు ముస్తాబు చేస్తున్నారు.

‘డబుల్ ఇస్మార్ట్’ తర్వాత రామ్ తన లైనప్ ను ఎంతో క్రేజీగా మార్చేయబోతున్నాడు. ముందుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడట. అసలు త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే.. ఈసారి బన్నీ కోసం సోషియో ఫాంటసీ స్టోరీ రెడీ చేస్తున్న త్రివిక్రమ్.. మరో ఏడాది పాటు ఆ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేయనున్నాడట. ఈలోపులో రామ్ తో సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే త్రివిక్రమ్.. రామ్ కి ఓ స్టోరీ చెప్పడం.. దానికి ఉస్తాద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనేది ఫిల్మ్ నగర్ టాక్.

త్రివిక్రమ్ సినిమాతో పాటు.. ఓటీటీ జయంట్ నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రామ్. త్వరలోనే.. రామ్ డెబ్యూ వెబ్ సిరీస్ కి సంబంధించి ఫుల్ డిటెయిల్స్ తెలియనున్నాయి. మరోవైపు.. హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేయనున్నాడట. మొత్తంమీద.. ‘డబుల్ ఇస్మార్ట్’ వచ్చే లోపే.. ఈ మూడు ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఫుల్ డిటెయిల్స్ ఫ్యాన్స్ తో పంచుకోనున్నాడట ఎనర్జిటిక్ స్టార్.

Related Posts