‘భగవంత్ కేసరి‘ లేటెస్ట్ కలెక్షన్స్

బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ‘భగవంత్ కేసరి‘ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. మూడో వారంలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ కొనసాగిస్తోంది. వరల్డ్ వైడ్ గా 18 రోజులకు గానూ రూ.139.9 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది ఈ చిత్రం. షేర్ విషయానికొస్తే 18 రోజులకు రూ.70.18 కోట్లు కలెక్ట్ చేసింది.

‘భగవంత్ కేసరి‘ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ రూ.57.63 కోట్లకు జరిగింది. ఆ లెక్కన ఇప్పటికే ఈ చిత్రం దాదాపు రూ.14 కోట్లు ప్రాఫిట్ తీసుకొచ్చింది. గత వారం విడుదలైన చిత్రాల్లో పెద్ద సినిమాలేవీ లేవు. అలాగే.. ఈ వారం దీపావళి కానుకగా తెలుగు నుంచి సినిమాలేవీ రావడం లేదు. రెండు, మూడు అనువాద సినిమాలు మాత్రం దివాళి స్పెషల్ గా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఈనేపథ్యంలో.. బాక్సాఫీస్ వద్ద ‘భగవంత్ కేసరి‘ వసూళ్ల సునామీ ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి.. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఇంకా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Related Posts