తమన్ మ్యూజికల్ వీక్

‘ధమ్ మసాలా బిర్యానీ.. ఎర్ర కారం అరకోడి.. నిమ్మ సోడా ఫుల్ బీడీ.. గుద్ది పారేయ్ గుంటూర్ని’ అంటూ ‘గుంటూరు కారం’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది. రామజోగయ్య శాస్త్రి రచనలో సంజిత్ హెగ్డే ఆలపించిన ఈ ఫుల్ సాంగ్ నవంబర్ 7న రాబోతుంది. ప్రోమోను బట్టి ఈ పాటలో మహేష్ బాబు మాస్ స్వాగ్ అయితే అదరగొట్టబోతున్నట్టు అర్థమవుతోంది. ఇక.. ఒక్కసారి ఈ సాంగ్ రిలీజయ్యిందో.. వెంటనే చార్ట్ బస్టర్ కావడం ఖాయం.

నవంబర్ 7న ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ వస్తుంటే.. అదే రోజున ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ సాంగ్ ఎప్పుడు రాబోతుంది అనేదానిపై అనౌన్స్ మెంట్ రానుందట. దీపావళి కానుకగా ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ సింగిల్ ‘జరగండి’ విడుదల కాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ పాటకు సంబంధించి వదిలిన పోస్టర్ అయితే ఎంతగానో ఆకట్టుకుంటుంది. శంకర్ స్టైల్ లో ఎంతో లావిష్ గా ఈ సాంగ్ ను పిక్చరైజ్ చేశారట. ఈ పాటకోసమే దాదాపు రూ.16 కోట్లు ఖర్చుపెట్టారనే ప్రచారం ఉంది. ఏదేమైనా ఒకవైపు ‘గుంటూరు కారం’ మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ పాటలతో వచ్చే వారం అంతా యూట్యూబ్ లో తమన్ మ్యూజికల్ హంగామా ఉండబోతుంది.

Related Posts