ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ గా ‘ఒసేయ్ అరుంధతి‘

వెన్నెల కిషోర్, కమల్ కామరాజు హీరోలుగా.. మోనికా చౌహాన్ ఫీమేల్ లీడ్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి‘. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

‘హైదరాబాద్ కు చెందిన అరుంధతి అనే మధ్య తరగతి ఇల్లాలు.. తన పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా పాడుకుంటుందనేదే ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా కథ‘ అని చిత్ర బృందం చెబుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల తేదీని ప్రకటించనుందట టీమ్.

Related Posts