Latest

స‌మంత‘శాకుంతలం’ ఫిబ్ర‌వ‌రి 17న గ్రాండ్ రిలీజ్‌

అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందించే  ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తోన్న  అద్భుతమైన పౌరాణిక‌ దృశ్య కావ్యం శాకుంతలం’. ఇండియ‌న్…

1 year ago

చక్రవ్యూహం ది ట్రాప్ పోస్టర్ కి విశేష స్పందన

సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత శ్రీమతి.సావిత్రి నిర్మిస్తున్న చిత్రం "చక్రవ్యూహం" ది ట్రాప్. ఈ చిత్రంలో ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న…

1 year ago

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఫస్ట్ లుక్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. 'కళ్యాణ…

1 year ago

శ్రీలీలతో జతకట్టనున్న వైష్ణవ్ తేజ్

పంజా వైష్ణవ్ తేజ్ ,సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ చిత్రం  *'పంజా వైష్ణవ్ తేజ్ ' హీరోగా ‘శ్రీ లీల‘ నాయికగా  సితార ఎంటర్ టైన్మెంట్స్,…

1 year ago

వీరసింహారెడ్డి సినిమాటోగ్రాఫర్‌ రిషి పంజాబీ ఇంటర్వ్యూ

'వీరసింహారెడ్డి' లార్జర్ దెన్ లైఫ్ మూవీ.. విజువల్ ఫీస్ట్ లా వుంటుంది. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయి:   గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'వీరసింహారెడ్డి' ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని  జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా ఆలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ గా పని చేసిన రిషి పంజాబీ విలేఖరుల సమావేశంలో 'వీరసింహారెడ్డి' విశేషాలని పంచుకున్నారు. కెమరామెన్ గా  సినిమాకి మొదటి ప్రేక్షకుడు మీరు..  'వీరసింహారెడ్డి' ఎలా ఉండబోతుంది ? వీరసింహారెడ్డి లార్జర్ దెన్ లైఫ్ మూవీ. యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో వుంటాయి.  ప్రేక్షకులకు సినిమా విజువల్ ఫీస్ట్ లా వుంటుంది. సినిమా చూస్తున్నపుడు చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి. 'వీరసింహారెడ్డి' బిగ్ బ్లాస్టింగ్ ఎంటర్ టైనర్. బాలకృష్ణ గారితో పని చేయడం ఎలా అనిపించింది ? బాలకృష్ణ గారితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టెక్నిషియన్స్ ని చాల గొప్పగా అర్ధం చేసుకుంటారు. చాలా గౌరవిస్తారు. బాలయ్య గారికి ప్రతి డిపార్ట్మెంట్ పై గొప్ప అవగాహన వుంటుంది. చాలా ఫ్రీడమ్ ఇస్తూ టెక్నిషియన్ కి మంచి కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. బాలకృష్ణ గారి పర్సోనా లార్జర్ దెన్ లైఫ్. ఆయన స్క్రీన్ ప్రజన్స్ అవుట్ స్టాండింగ్.  'వీరసింహారెడ్డి' కోసం ఎన్ని లొకేషన్ లో షూట్ చేశారు.. షూటింగ్ పరంగా కష్టమైన లొకేషన్  ఏది ? 'వీరసింహారెడ్డి' కోసం ఏడాది పాటు షూట్ చేశాం. దాదాపు అన్ని బుతువుల్లో షూటింగ్ జరిగింది. సిరిసిల్లల్లో షూట్ చేస్తునపుడు తీవ్రమైన వేడి వుండేది. అలాగే టర్కీ , ఇస్తాంబుల్, అంటాల్య లో కూడా షూటింగ్ చేశాం.  అక్కడ కూడా చాలా వేడి వుంటుంది. ఈ సినిమాలో రగ్గడ్ నెస్ కావాలి. దాని కోసం టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి దాన్ని ఎచీవ్ చేశాం. టెక్నికల్ గా ఈ సినిమా కోసం ఏమైనా ప్రయోగాలు చేశారా ? బాలకృష్ణ గారి పర్సోనా లార్జర్ దెన్ లైఫ్. దాన్ని తెరపై ఎంత గొప్పగా ఆవిష్కరించాలనే దానిపై ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టాం. లండన్ నుండి తీసుకొచ్చిన న్యూ సెటప్ లెన్స్ లు వాడాం. కలర్స్ అద్భుతంగా వుంటాయి. సినిమా విజువల్ ఫీస్ట్ లా వుంటుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తో పని చేయడం ఎలా అనిపించింది గోపీచంద్ మలినేని యంగ్ అండ్ డైనమిక్ వండర్ ఫుల్ డైరెక్టర్. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. ఆలోచనలు పంచుకోవడం పట్ల చాలా ఓపెన్ గా వుంటారు. తనతో పని చేయడం మంచి అనుభూతి. తన గత చిత్రం క్రాక్ చూశాను. నిజానికి మేము కలసి ప్రాజెక్ట్ చేయాల్సింది. వేర్వేరు ప్రాజెక్ట్స్ వుండటం వలన కుదరలేదు. ఇప్పుడు తనతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల గురించి ? రవి గారు, నవీన్ గారు అద్భుతమైన నిర్మాతలు. వారి సపోర్ట్ మర్చిపోలేను. ఇంత గొప్ప నిర్మాతలని నేను చూడలేదు. వారికి సినిమా పట్ల గొప్ప ప్యాషన్ వుంది. సినిమాని చాలా చక్కగా అర్ధం చేసుకుంటారు. సినిమాకి ఏం కావాలంటే అది సమకూరుస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ తో మళ్ళీ మళ్ళీ కలసి పని చేయాలని వుంది.  కమర్షియల్ మాస్ మాసాలా ఎంటర్ టైనర్స్ చేయడంలో ఎలాంటి సవాల్ వుంటుంది ? సవాల్ అంటూ ఏమీ వుండదు. గతంలో సరైనోడు, జయ జానకి నాయక లాంటి మాస్ ఎంటర్ టైనర్స్ చేశాను. ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ థాంక్స్

1 year ago

NTR 30 ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5 2024 గ్రాండ్ రిలీజ్‌

RRR వంటి పాన్ ఇండియా సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన హీరో ఎన్టీఆర్. ఈయ‌న క‌థానాయ‌కుడిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా…

1 year ago

అమిగోస్ నుంచి కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్

బింబిసార‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సత్తా చాటిన నంద‌మూరి క‌థానాయ‌కుడు క‌ళ్యాణ్ రామ్‌. ఈయ‌న మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి…

1 year ago

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ #Nani30 వరల్డ్ విడుదల

నేచురల్ స్టార్ నాని తన 30వ సినిమా కోసం వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కొలబరేట్ అవుతున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 రూపొందునున్న ఈ చిత్రాన్ని…

1 year ago

వీరసింహారెడ్డిమాస్ మొగుడు పాట జనవరి 3న విడుదల

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వీరసింహారెడ్డి' చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 6న ఒంగోలులో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు. అంతకంటే ముందు ఈ చిత్రంలోని నాల్గవ, చివరి పాట- మాస్ మొగుడు లిరికల్ వీడియో జనవరి 3వ తేదీ సాయంత్రం 7:55 గంటలకు విడుదల కానుంది. బాలకృష్ణ, శ్రుతి హాసన్ ల రాకింగ్ కెమిస్ట్రీని చూపించే పోస్టర్ ద్వారా సాంగ్ డేట్ ని ప్రకటించారు. బాలకృష్ణ ట్రెడిషనల్ వేర్ లో రాయల్ గా కనిపించగా, శ్రుతి హాసన్ ట్రెండీ డ్రెస్ లో గ్లామర్ గా కనిపిస్తోంది. మాస్ మొగుడు థమన్ మార్క్ మాస్ నంబర్‌ గా ఉండబోతోంది. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి  రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్ ఫైట్ మాస్టర్స్ గా పని చేస్తున్నారు. నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.

1 year ago

ప్రభాస్ ‘టైర్’ స్పెషాలిటీ ఏంటీ…?

వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్యాన్ ఇండియన్ స్టార్ గా ఏ ప్రాజెక్ట్ చేసినా అది యూనివర్సల్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేదిలా…

1 year ago