భోళా.. నెంబర్ వన్ ఎలా.. ?

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఖచ్చితంగా హిట్టే అని ఎక్కడా లేదు. ఆయనకూ వీర ఫ్లాపులు పడ్డ రోజులున్నాయి. అయినా కంటెంట్ నే బట్టే కదా విజయాలు వచ్చేది. బట్ రీ ఎంట్రీలో మాత్రం అదరగొడుతున్నాడు అనే చెప్పాలి. ఒక్క ఆచార్య తప్ప అన్నీ వందకోట్లు దాటి కలెక్షన్స్ సాధించాయి. రీసెంట్ గా వచ్చిన వాల్తేర్ వీరయ్య ఏకంగా 240 కోట్ల వరకూ కలెక్ట్ చేసి మెగా స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. ప్రస్తుతం భోళా శంకర్ గా వస్తున్నాడు.

లేటెస్ట్ గా వచ్చిన టీజర్ లో ఆయన ఇమేజ్ కు తగ్గ ఎలివేషన్స్ తప్ప ఏం లేదు అని తేలిపోయింది. ఇవన్నీ వింటేజ్ మెగా ట్రిక్స్. వాటినే మళ్లీ చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మెహర్‌ రమేష్‌. అయితే వాల్తేర్ వీరయ్యలో కూడా అదే చేసి విజయం అందుకున్నాడు దర్శకుడు బాబీ. మళ్లీ వెంటనే ఆ తరహా ఇమేజే రిపీట్ అయితే ఆడియన్స్ మొనాటనీ ఫీలవుతారు అనేది వీరు చూసుకున్నారో లేదో తెలియదు కానీ.. ఈ మూవీ చిరంజీవి కెరీర్ లో నెంబర్ వన్ అవుతుందని నిర్మాత ఘంటాపథంగా చెబుతున్నాడు. అది విన్న అంతా నోరెళ్లబెడుతున్నారు.

భోళా శంకర్ టీజర్ చూసిన తర్వాత కూడా ఈ మూవీ చిరంజీవి కెరీర్ లో నెంబర్ వన్ ఎలా అవుతుందీ అని సెటైర్స్ వేస్తున్నారు కూడా. ఇంకా చెబితే ఇదేం కొత్త కథ కాదు. తమిళ్ మూవీ వేదాళంకు రీమేక్. అది తెలుగులోనూ డబ్ అయింది. అదే కథను కాస్త అటూ ఇటూ తిప్పి రజినీకాంత్ కూడా పెద్దన్నగా చేశాడు. అస్సలే మాత్రం ఆకట్టుకోలేదీ సినిమా. ఇప్పుడు చిరంజీవి చేస్తున్నాడు. ఎంత ఇమేజ్, నేటివిటీకి తగ్గ మార్పులు ఉన్నా.. మూల కథ మారదు.

అంటే అది ఆల్రెడీ ప్రేక్షకులు చూసిన కథే. ఇక ఎలివేషన్స్, ఇమేజ్ లకు తగ్గ బిల్డప్పులూ అంటారా.. ఆల్రెడీ వాల్తేర్ వీరయ్యలో ఈ మధ్యే చూసి ఉన్నాం. ఇంక కొత్తగా ఏముంటుందీ అంటే సినిమా చూడమనే చెబుతారు. బట్.. నిర్మాతతో పాటు దర్శకుడు కూడా ఈ సినిమా గురించి ఇస్తోన్న బిల్డప్పులు చూస్తుంటే వారి నమ్మకాన్ని అభినందించక తప్పదు అనిపిస్తుంది.

Related Posts