బండ్ల గణేష్ కు ఊపొచ్చింది..

నటుడు నుంచి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ కు ఊపొచ్చింది. అందుకే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. ఏం మాట్లాడినా కుండ బద్ధలు కొట్టడం గణేష్ స్టైల్. ఇది రాజకీయాల్లో అంతగా పనికాదు. ఆచి తూచి మాట్లాడట… అవసరాన్ని బట్టి అవతలి వారిపై రెచ్చిపోవడం అవసరం. ఈ విషయంలో బండ్ల గణేష్ కాస్త వెనకబడ్డాడు. అందుకే గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచారం చేశాడు.

అయితే పార్టీ గెలవకపోతే బ్లేడ్ తో కోసుకుంటా అంటూ.. అనవసరమైన కమెంట్స్ చేసి రచ్చ రచ్చయ్యాడు.. అనేకంటే చేశారు అంటే బావుంటుంది. దీంతో తను బాగా హర్ట్ అయ్యాడు. రాజకీయాల నుంచే తప్పుకుంటున్నా అని ప్రటించాడు. బట్ ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీపై తన అభిమానాన్ని తగ్గించుకోలేదు.

మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిగానే ఉన్న బండ్ల గణేష్ కొన్నాళ్లుగా సినిమాలు కూడా నిర్మించడం లేదు. ఆ మధ్య నటుడుగా రీ ఎంట్రీ ఇస్తూ.. సర్కారువారి పాటలో చేసిన కేమియో రోల్ అస్సలు పండలేదు. అప్పుడప్పుడూ ట్విట్టర్ లో సంచలనాలు సృష్టిస్తూ.. ఇంటర్వ్యూస్ లో హల్చల్ చేస్తున్న అతను సడెన్ గా మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు.


కర్ణాటక ఎలెక్షన్స్ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఊపు వచ్చింది. ఈ ఊపును చూసి చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పెద్ద ఎత్తున చేరికలు కూడా మొదలవుతున్నాయి. ఈ క్రమంలో బండ్ల గణేష్ మళ్లీ రావాలనుకోవడం తప్పేం కాదు. ఆ మాటకొస్తే.. కాంగ్రెస్ పార్టీలోఇప్పుడున్న చాలామందికంటే అతను సిన్సియర్. మాట్లాడుతుంటే కాస్త కామెడీగా అనిపించినా.. కాలిక్యులేషన్స్ కరెక్ట్ గా ఉంటాయి. సబ్జెక్ట్ తోనే మాట్లాడతాడు.

అందుకే అతను మళ్లీ కాంగ్రెస్ లో చేరడంలో ఆశ్చర్యమేం లేదు. ఈ విషయాన్ని తనే ప్రకటించాడు. అయితే మళ్లీ ఎప్పట్లానే చేరుతున్న విషయం స్పష్టంగా చెప్పుకుండా.. ” అన్నా వస్తున్నా.. అడుగులో అడుగేస్తా చేతిలో చెయ్యేస్తా.. కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్ ” అంటూ భట్టి విక్రమార్కను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

ఇందులో తను మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఎక్కడా చెప్పలేదు.
అయితే రీసెంట్ గానే బండ్ల గణేష్‌ మల్లికార్జున ఖర్గే, డీకె శివ కుమార్ , రేవంత్ రెడ్డి ని కలిశాడు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడని టాక్. మరి ఈ సారి కేవలం ప్రచారానికే పరిమితం అవుతాడా లేక ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశిస్తాడా అనేది చూడాలి.

Related Posts