ప్రభాస్.. ఇది కదా ఎదగడం అంటే

కమల్ హాసన్ తో కలిసి ఒక చిన్న సీన్ లో నటించినా చాలు.. అని అనుకునే స్టార్స్ అన్ని పరిశ్రమల్లోనూ చాలామందే ఉన్నారు. అలాంటి కమల్ ను ఢీ కొట్టే పాత్ర చేయాలంటే ఏ రేంజ్ ఉండాలి. అది కూడా హీరోగా. యస్.. ఇప్పుడు ఆ రేంజ్ కు చేరుకున్నాడు ప్రభాస్. ఇంకా చెబితే.. కొన్నాళ్ల క్రితం.. అది కూడా బాహుబలి తర్వాత.. తెలుగులో ఓ సినిమా ఫంక్షన్ లో కమల్ హాసన్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. తనను తాను పరిచయం చేసుకున్నాడు ప్రభాస్. ” సార్ కు నేనెవరో తెలియకపోవచ్చు.. నా పేరు ప్రభాస్ సార్” అని వినయంగా చెప్పుకున్నాడు.

అఫ్‌ కోర్స్ కమల్ కు తెలుసు ప్రభాస్ ఎవరో. కానీ అతని గెస్చర్ కు చాలామంది ఫిదా అయ్యారు. అలాంటి ప్రభాస్.. ఇప్పుడు కమల్ ను ఢీ కొట్టే హీరోగా నటిస్తున్నాడు అంటే ఆ గొప్పదనం ఎవరిదీ.. అంటే ఖచ్చితంగా కమల్ దే అని చెప్పాలి. బట్.. తను విలన్ గా నటించేందుకూ ఒప్పుకున్నాడు అంటే.. అవతలి హీరో స్టేచర్ ఏ రేంజ్ లో ఉండాలి..? ప్రభాస్ కు ఆ స్టేచర్ వచ్చింది కాబట్టే.. కమల్ హాసన్ విలన్ గా చేయడానికి కూడా ఒకే అన్నాడు. అదీ ఎదగడం అంటే.

నిజానికి ప్రభాస్ బాహుబలి తర్వాత ఇప్పటి వరకూ చేసిన మూడు సినిమాలూ ఫ్లాపులే. అయినా అతని రేంజ్ తగ్గలేదు. క్రేజ్ తగ్గలేదు. బిజినెస్ లో ఎలాంటి మార్పులూ రాలేదు. కొంత వరకూ ప్రభాస్ ను ఆడియన్స్ కు దగ్గర చేసింది సినిమాలు మాత్రమే కాదు. అతని వ్యక్తిత్వం కూడా. డార్లింగ్ అంటూ పిలుస్తూ.. ఆ పదానికి అర్థంలా మారాడు అతను. ఇంతింతై నటుడింతై అన్నట్టుగా ఎదిగాడు.

అసలు ప్రభాస్ కెరీర్ మొదలుపెట్టిన రోజులు చూస్తే.. అతను ఈ రేంజ్ కు వస్తాడని ఎవరైనా ఊహించారా..? ఒకప్పుడు ఛత్రపతి కంటే కొత్త బంగారులోకం కలెక్షన్స్ ఎక్కువ అని కూడా ఎద్దేవా చేశారు. బట్ ఇప్పుడు ఇండియాలోవరుసగా మూడు వందల కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ తెచ్చిన ఏకైక హీరో అయ్యాడు.

అలాగే ఓవర్శీస్ లో 3 మిలియన్ క్లబ్ లో మూడు సినిమాలున్న ఏకైక హీరో కూడా అతనే. తన ప్రయాణంలో దర్శకులదే అగ్రభాగం. కాదనలేం. కానీ ఆ దర్శకులకు తనే ఛాయిస్ లా మారడం ప్రభాస్ విజయం. ఆ విజయం.. విజయాలే.. ప్రభాస్ ను ఇవాళ కమల్ హాసన్‌ కే హీరోను చేశాయి. ఏదేమైనా డార్లింగ్.. నువ్వు సూపరెహే..

Related Posts