ఆర్ఆర్ఆర్ చివరి 30 నిమిషాలు భరించడం కష్టమట..?

ఆర్ఆర్ఆర్.. ఇండియాస్.. మోస్ట్ అవెయిటెడ్ మూవీ. ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ ప్యాన్ ఇండియన్ మూవీ. రామ్ చరణ్ ఆల్రెడీ తుఫాన్ చేశాడు. అంతకు ముందే మగధీరతో అందరు ఆడియన్సెస్ కు తెలుసు. జనవరి 7న విడుదల కాబోతోన్న ఈ చిత్రం కోసం సినిమా మెయిన్ టీమ్ అంతా దేశంలోని ప్రధాన నగరాల్లో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఆడియన్సెస్ కోసం ఎక్కువ కాన్ సెంట్రేట్ చేశారు. ఇటు సౌత్ లో కూడా ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తగ్గిన టికెట్ రేట్లు కొంత ఇబ్బంది పెట్టినా.. ఆ మేరకు తెలంగాణలో టికెట్ ధరలు పెరగడం కొంత కలిసొస్తుంది. పైగా ఇక్కడ అదనపు షోస్ కు కూడా అనుమతి ఉంది.
ఇక ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంచనాలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజమౌళి బాహుబలి తర్వాత వస్తోన్న చిత్రం కాబట్టి ఓవర్శీస్ లో కూడా ఆ రేంజ్ లోనే అంచనాలున్నాయి. స్వాంతంత్ర్య సమరయోధులైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలను పోలిన కథలతో వస్తున్న చిత్రం ఇదని రాజమౌళి ముందు నుంచీ చెబుతున్నారు. 1920ల నాటి భారత్ లోని పరిస్థితులకు కల్పిత కథలతో రాసుకున్న సినిమా అని కూడా చెప్పాడు. అయితే ఆ కాలం నాటి కథ కాబట్టి పాత్రల లైఫ్ టైమ్ కూడా ఇంపార్టెంట్ కదా.. ? ఆ విషయంలోనే రాజమౌళి తన సినిమాల్లో ఎన్నడూ లేనంతగా చివరి 30నిమిషాల్లో హృదయాలు భరించలేనంత ఎమోషన్స్ ను దట్టించాడట. ఈ సీన్స్ ను చూసిన ఏ ఒక్కరూ ఏడ్వకుండా ఉండలేరని ఖచ్చితంగా చెబుతున్నారు.
మామూలుగానే రాజమౌళి సినిమాల్లో బలమైన కథలు లేకున్నా బలమైన ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ తోనే ఎక్కువగా కట్టిపడేస్తాడు జక్కన్న. ఇక ఈ సినిమాలో ఇద్దరు టాప్ హీరోలున్నారు. ఆ ఇద్దరూ చివరికి మరణిస్తారు. ఆ పాత్రలు చనిపోతున్న సందర్భంలోనే హై ఎమోషన్ ను పండించేలా ప్లాన్ చేసుకున్నాడట జక్కన్న. ఇది హీరోల అభిమానులైతే బోరుమని ఏడ్చేలా చిత్రీకరించారట. అలాగని కేవలం ఎమోషన్ మాత్రమే ఉంటే బోర్ కొడుతుంది కదా.. దీనికి దేశభక్తితో పాటు వీరి పోరాట సన్నివేశాలను జోడించి.. వాళ్లు గెలిస్తే దేశమే గెలుస్తుంది అనే ఉద్వేగం ప్రేక్షకుల్లో కలిగిస్తూనే.. ఆ పాత్రలను ముగించే సన్నివేశాలను ఎమోషనల్ గా తీశారంటున్నారు. మరి ఇదే నిజమైతే.. ఈ సారి రాజమౌళి ఏడిపించబోతున్నాడనే అనుకోవాలి.

Related Posts