రాధేశ్యామ్ పోస్ట్ పోన్.. ఆచార్య ముందుకు.. సాధ్యమేనా..?

ప్రపంచాన్ని థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. వరుసగా కోవిడ్ కేస్ లు పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ గా ఒమిక్రాన్ సైతం చాపకింద నీరులా పెరుగుతోంది. ఈ క్రమంలో మరోసారి లాక్ డౌన్ తప్పదు అనేలా సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. ఇలాగే జరిగితే వచ్చే ఆరు నెలల్లో మరోసారి తెలుగు సినిమా పరిశ్రమకు గడ్డు కాలం వస్తుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ అవుతోంది అనే రూమర్స్ వస్తున్నాయి. కానీ అయ్యేలా కనిపించడం లేదు. అలాగే మరో ప్యాన్ ఇండియన్ మూవీగా వస్తోన్న రాధేశ్యామ్ సైతం సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటోంది అనే మాటలూ వస్తున్నాయి.
మహరాష్ట్రలో నైట్ కర్ఫ్యూ పెట్టబోతున్నారనీ.. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9గంటల వరకూ ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని.. తద్వారా థియేటర్స్ కు కేవలం మూడు షోస్ కు అది కూడా 50శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే పర్మిషన్ ఉంటుందనే రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. వీటి కారణంగానే ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ మూవీస్ గా ఉన్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ పోస్ట్ పోన్ అవుతున్నాయంటున్నారు.
బట్ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే చాలా అడుగులు ముందుకు వేసింది. ఇంక వాయిదా పడటం అసాధ్యం. అందుకే రాధేశ్యామ్ వెనక్కి వెళుతుందంటున్నారు. దీనికి రీసెంట్ గా నిర్మాతలు కూడా మా సినిమా 2022లోనే విడుదల అని గతంలోనే ఫిక్స్ అయ్యాం అంటున్నారు. అంటే సంక్రాంతి అని ఖచ్చితంగా చెప్పలేదు. సో.. రాధేశ్యామ్ వాయిదా పడుతుందంటున్నారు.
రాధేశ్యామ్ పోస్ట్ పోన్ అయితే ఆ డేట్ లో రావడానికి మెగాస్టార్ మూవీ ఆచార్య వస్తుందనే విచిత్రమైన రూమర్ కూడా వినిపిస్తోంది. నిజానికి ఇది అసాధ్యం. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ ఉన్నాడు. ఆచార్యలోనూ ఉన్నాడు. ఒకేసారి రెండు సినిమాలు వస్తే.. రెండు సినిమాలకూ నష్టమే. అందుకే రాధేశ్యామ్ వాయిదా పడినా ఆ డేట్ లో ఆచార్య రావడం దాదాపు అసాధ్యం అనే �