నందమూరి కుటుంబంలో ఫ్లెక్సీల గొడవ

ఈరోజు (జనవరి 18) నటరత్న నందమూరి తారకరామారావు వర్థంతి. ఈ సందర్భంగా.. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కి నివాళులర్పించారు. అయితే.. ఇదే సమయంలో ఎన్టీఆర్ కుటుంబంలోని అంతర్లీనంగా ఉన్న గొడవలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం చర్చనీయాంశమైంది.

ఎన్టీఆర్ కి నివాళులర్పించేందుకు ఆయన మనవడు జూ.ఎన్టీఆర్ వస్తాడని.. అతని అభిమానులు తారక్ కి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే.. బాలకృష్ణ వచ్చి నివాళులర్పించిన తర్వాత అక్కడ నుంచి జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ‘తీయించేయ్.. వెంటనే తీయించేయ్’ అన్నట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. మరి.. ఆయన మాటలు ఫ్లెక్సీలను ఉద్దేశించనవేనా అనేది తెలియాల్సి ఉంది.

గతంలో తెలుగు దేశం పార్టీ తరపున భారీగా ప్రచారాన్ని కూడా నిర్వహించిన జూ.ఎన్టీఆర్.. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. అలాగే.. బాలకృష్ణ, చంద్రబాబు వంటి వారితోనూ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నాడు. నందమూరి కుటుంబంలోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లోనూ జూనియర్ కనిపించడం లేదు. ఈనేపథ్యంలో.. బాబాయ్, అబ్బాయ్ ల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం చాన్నాళ్లుగా వినిపిస్తుందే. ఇప్పుడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఈ గొడవలు బయటపడ్డాయనే ప్రచారం జరుగుతుంది.

Related Posts