‘కెప్టెన్ మిల్లర్’ ట్రైలర్.. పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్

నేషనల్ అవార్డ్ విన్నర్, కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. బ్రిటీష్ ఆర్మీలో చేరాలనుకునే ఓ కుర్రాడు.. చివరకుతన సొంత మనుషులపైనే తుపాకీ ఎక్కుపెట్టాల్సిన పరిస్థితి రావడంతో ఏం చేశాడు? అనేదే ఈ సినిమా కథాంశం. ట్రైలర్ అయితే ఆద్యంతం విజువల్ ట్రీట్ అందిస్తోంది.

ఈ సినిమాలో ధనుష్ మేకోవర్ టెర్రిఫిక్ గా కనిపిస్తోంది. శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్, ప్రియాంక మోహన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే తమిళనాట పొంగల్ కానుకగా విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 25న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts