Y Ravishankar

IT raids completed on Mythri Movie Makers

The Income Tax Department raids on Mythri Movie Makers, a Telugu film production company and director Sukumar, came to an…

1 year ago

Allu Arjun eyeing on December release

The film ‘Pushpa: The Rise’, starring Allu Arjun and Rashmika Mandanna, was a spectacular box office hit and the film…

1 year ago

వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు: మెగాస్టార్ చిరంజీవి

వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాబోతుంది : మాస్ మహారాజా రవితేజ వాల్తేరు వీరయ్య గుండెల్లో నాటుకుపోతుంది. పూనకాలు అందరికీ రీచ్ అవుతాయి: దర్శకుడు…

1 year ago

వీరసింహారెడ్డి సినిమాటోగ్రాఫర్‌ రిషి పంజాబీ ఇంటర్వ్యూ

'వీరసింహారెడ్డి' లార్జర్ దెన్ లైఫ్ మూవీ.. విజువల్ ఫీస్ట్ లా వుంటుంది. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయి:   గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'వీరసింహారెడ్డి' ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్రంలోని  జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి.. పాటలు సెన్సేషనల్ హిట్స్ గా ఆలరించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ గా పని చేసిన రిషి పంజాబీ విలేఖరుల సమావేశంలో 'వీరసింహారెడ్డి' విశేషాలని పంచుకున్నారు. కెమరామెన్ గా  సినిమాకి మొదటి ప్రేక్షకుడు మీరు..  'వీరసింహారెడ్డి' ఎలా ఉండబోతుంది ? వీరసింహారెడ్డి లార్జర్ దెన్ లైఫ్ మూవీ. యాక్షన్, ఎమోషన్స్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో వుంటాయి.  ప్రేక్షకులకు సినిమా విజువల్ ఫీస్ట్ లా వుంటుంది. సినిమా చూస్తున్నపుడు చాలా చోట్ల గూస్ బంప్స్ వస్తాయి. 'వీరసింహారెడ్డి' బిగ్ బ్లాస్టింగ్ ఎంటర్ టైనర్. బాలకృష్ణ గారితో పని చేయడం ఎలా అనిపించింది ? బాలకృష్ణ గారితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. టెక్నిషియన్స్ ని చాల గొప్పగా అర్ధం చేసుకుంటారు. చాలా గౌరవిస్తారు. బాలయ్య గారికి ప్రతి డిపార్ట్మెంట్ పై గొప్ప అవగాహన వుంటుంది. చాలా ఫ్రీడమ్ ఇస్తూ టెక్నిషియన్ కి మంచి కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. బాలకృష్ణ గారి పర్సోనా లార్జర్ దెన్ లైఫ్. ఆయన స్క్రీన్ ప్రజన్స్ అవుట్ స్టాండింగ్.  'వీరసింహారెడ్డి' కోసం ఎన్ని లొకేషన్ లో షూట్ చేశారు.. షూటింగ్ పరంగా కష్టమైన లొకేషన్  ఏది ? 'వీరసింహారెడ్డి' కోసం ఏడాది పాటు షూట్ చేశాం. దాదాపు అన్ని బుతువుల్లో షూటింగ్ జరిగింది. సిరిసిల్లల్లో షూట్ చేస్తునపుడు తీవ్రమైన వేడి వుండేది. అలాగే టర్కీ , ఇస్తాంబుల్, అంటాల్య లో కూడా షూటింగ్ చేశాం.  అక్కడ కూడా చాలా వేడి వుంటుంది. ఈ సినిమాలో రగ్గడ్ నెస్ కావాలి. దాని కోసం టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసి దాన్ని ఎచీవ్ చేశాం. టెక్నికల్ గా ఈ సినిమా కోసం ఏమైనా ప్రయోగాలు చేశారా ? బాలకృష్ణ గారి పర్సోనా లార్జర్ దెన్ లైఫ్. దాన్ని తెరపై ఎంత గొప్పగా ఆవిష్కరించాలనే దానిపై ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టాం. లండన్ నుండి తీసుకొచ్చిన న్యూ సెటప్ లెన్స్ లు వాడాం. కలర్స్ అద్భుతంగా వుంటాయి. సినిమా విజువల్ ఫీస్ట్ లా వుంటుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని తో పని చేయడం ఎలా అనిపించింది గోపీచంద్ మలినేని యంగ్ అండ్ డైనమిక్ వండర్ ఫుల్ డైరెక్టర్. తనకి చాలా మంచి భవిష్యత్ వుంటుంది. ఆలోచనలు పంచుకోవడం పట్ల చాలా ఓపెన్ గా వుంటారు. తనతో పని చేయడం మంచి అనుభూతి. తన గత చిత్రం క్రాక్ చూశాను. నిజానికి మేము కలసి ప్రాజెక్ట్ చేయాల్సింది. వేర్వేరు ప్రాజెక్ట్స్ వుండటం వలన కుదరలేదు. ఇప్పుడు తనతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల గురించి ? రవి గారు, నవీన్ గారు అద్భుతమైన నిర్మాతలు. వారి సపోర్ట్ మర్చిపోలేను. ఇంత గొప్ప నిర్మాతలని నేను చూడలేదు. వారికి సినిమా పట్ల గొప్ప ప్యాషన్ వుంది. సినిమాని చాలా చక్కగా అర్ధం చేసుకుంటారు. సినిమాకి ఏం కావాలంటే అది సమకూరుస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ తో మళ్ళీ మళ్ళీ కలసి పని చేయాలని వుంది.  కమర్షియల్ మాస్ మాసాలా ఎంటర్ టైనర్స్ చేయడంలో ఎలాంటి సవాల్ వుంటుంది ? సవాల్ అంటూ ఏమీ వుండదు. గతంలో సరైనోడు, జయ జానకి నాయక లాంటి మాస్ ఎంటర్ టైనర్స్ చేశాను. ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ థాంక్స్

1 year ago