Sreeja

Sreeja’s ex-husband Shirish Bharadwaj passed away

Chiranjeevi's youngest daughter Sreeja's ex-husband Shirish Bharadwaj died of illness. He passed away suffering from lung problem. Shirish Bhardwaj is…

3 weeks ago

శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. లంగ్స్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఆయన కన్నుమూశారు. శిరీష్ భరద్వాజ్ వయసు…

3 weeks ago

A bad move for Mega family during elections

The Mega family finds itself in a very tricky situation right now, with general audiences trolling the family following the…

1 year ago

పవన్ కళ్యాణ్‌ ఫోటో ఫేక్ కాదా..

పవన్ కళ్యాణ్‌ మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ సోషల్ మీడియాతో కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. పాలిటిక్స్ లో ఉండటం వల్ల అవి ప్రతి…

1 year ago

హీరో శ్రీకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`.  'జాతిరత్నాలు'తో బ్లాక్‌ బస్టర్‌ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో కథానాయకుడు శ్రీకాంత్ రెడ్డి విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి చెప్పండి,..అలాగే 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? మాది హైదరాబాద్. అల్వాల్ లో వుంటాను. బిటెక్ పూర్తి చేశాను. బిటెక్ థర్డ్ ఇయర్ నుండే సినిమాల పై ఆసక్తి పెరిగింది. కొన్ని లఘు చిత్రాలు చేశాను. కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. ఈ క్రమంలో పిట్టగోడ ఆడిషన్ లో మెయిన్ లీడ్ గా ఎంపికయ్యాను. అక్కడే అనుదీప్ పరిచయం. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో కూడా మంచి పాత్రల కోసం ఆడిషన్స్ ఇస్తూనే వున్నాను. కథ హీరో అని నమ్ముతాను. మంచి కథలో చిన్న పాత్ర చేసినా తృప్తి వుంటుంది. అలాంటిది చిరంజీవి గారు , కమల్ హసన్ గారు లాంటి గొప్పగొప్ప హీరోలతో గొప్ప క్లాసిక్ చిత్రాలు తీసిన పూర్ణోదయ బ్యానర్ లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.  వంశీ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. అంతకుముందే అనుదీప్ ఈ కథ గురించి ఒకసారి నాకు చెప్పారు. చాలా అద్భుతమైన కథ. ఆడిషన్స్ ఇచ్చాను. దర్శక నిర్మాతలకు నచ్చింది. తర్వాత ఫోటోషూట్ చేశారు. అందులో సెలెక్ట్ అయిన తర్వాతే ఫైనల్ చేశారు. నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. నాలో ప్రతిభని గుర్తించి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కథ నేపధ్యం గురించి చెప్పండి ? ఈ కథ చాలా రిఫ్రెషింగ్ గా వుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సాధించడానికి శీను అనే కుర్రాడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది కథాంశం. కథలో అద్భుతమైన సోల్ తీసుకొచ్చారు అనుదీప్. జాతిరత్నాల్లో ప్రతి సీన్ హ్యూమర్స్ గా వుంటుంది. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కూడా ప్రతి సీన్ హిలేరియస్ గా వుంటుంది. నారయణఖేడ్, శంకర్ పల్లి, చేవెళ్ళ ప్రాంతాల్లో ఖుషి సినిమానాటి వాతావరణం రిక్రియేట్ చేసేలా వింటేజ్ లుక్ లో షూట్ చేశాం. అనుదీప్ నారయణఖేడ్ ప్రాంతంలో పెరిగారు. ఆయన రాసే కథలు ఆ ప్రాంతం చుట్టూ జరిగేవే, అక్కడ ఆయన చూసిన వాతావరణంకు తగ్గట్టు లోకేషన్స్ ని ఎంచుకున్నాం. హాస్య ప్రధానమైన పాత్ర చేయడం ఎలా అనిపించింది ? కథలో నాకు నచ్చిన అంశం హాస్యం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్. నా పాత్ర చాలా హిలేరియస్ గా వుంటుంది. ఇందులో నా పాత్ర చేయడానికి వంశీ, అనుదీప్, శ్రీజ గారు చాలా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. దాదాపు 20 రోజులు వర్క్ షాప్ చేశాం. ఈ పాత్రని  చాలా ఎంజాయ్ చేశా. ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించారు.. రియల్ లైఫ్ లో ఎవరి ఫ్యాన్ ? పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే సూర్య గారు అంటే కూడా ఇష్టం. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చూసిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నయా ? పోకిరి, అత్తారింటికి దారేది, సూర్య గారి సినిమాలు 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చుసిన అనుభవాలు వున్నాయి. టికెట్లు దొరక్కపొతే గోడలు దూకి పోలీసులతో దెబ్బలు తిన్న సందర్భాలు కూడా వున్నాయి. ఐతే నా కంటే నా ఫ్రండ్స్ ఎక్కువ దెబ్బలు తిన్నారు. (నవ్వుతూ) 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కి ఇద్దరు దర్శకులు కదా.,,. ఇద్దరి దర్శకులతో పని చేయడం ఎలా అనిపించింది ? ఈ కథ సోల్ ని అనుదీప్ ఎంతలా అర్ధం చేసుకున్నారో వంశీ కూడా అంతే సమానంగా అర్ధం చేసుకున్నారు. అనుదీప్ శివకార్తికేయన్ గారి సినిమాతో బిజీ గా వుండటం వలన టెక్నికల్ గా స్ట్రాంగ్ గా వుండే లక్ష్మీనారాయణను మరో దర్శకుడిగా ఎంపిక చేశారు. వంశీ, లక్ష్మీ ఇద్దరూ గొప్ప సమన్వయంతో పని చేశారు. ఎవరి చేతిలో మైక్ వుంటే వాళ్ళే యాక్షన్ కట్ చెప్పేవారు. లక్ష్మీ నాకు టెక్నికల్ గా సపోర్ట్ చేస్తే.. వంశీ యాక్టింగ్ పరంగా హెల్ప్ చేశారు. తనికెళ్ళ భరణి గారితో పని చేయడం ఎలా అనిపించింది ?…

2 years ago