Satya

Rangabali’s focus on Satya paying off

Satya is a very promising comedian in Tollywood, who has an incredible comic timing but is grossly underrated and underused…

1 year ago

సత్య కామెడీ ఇంటర్య్యూ

సత్య.. కమెడియన్ గా తిరుగులేని టైమింగ్ తో ఎన్నో సినిమాల్లో నవ్వించాడు. అప్పుడప్పుడూ సునిల్ ను ఇమిటేట్ చేస్తున్నాడా అనిపించినా.. ప్రస్తుతం సునిల్ కామెడీ చేయడం లేదు…

1 year ago

Rangabali Trailer

The trailer of Naga Shaurya's upcoming film, Rangabali has been released today. The film is produced by Sudhakar Cherukuri, and…

1 year ago

రంగబలి ట్రైలర్.. సొంతూళ్లో సింహంలా ఉండాలి

నాగశౌర్య లేటెస్ట్ మూవీ రంగబలి. యుక్తితరేజా హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి పవన్ బాసంశెట్టి దర్శకుడు. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో మంచి ఇంప్రెషన్…

1 year ago

Bedurulanka 2012 finally marks its release time

Bedurulanka 2012' is actor Kartikeya Gummakonda's first release of 2023. THE Vijay Deverakonda released its teaser. Directed by Clax and produced…

1 year ago

రామబాణంలా వస్తున్న గోపీచంద్

కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు బలమైన కథలు ఎంచుకోవాలి. లేదంటే ఉన్న ఇమేజ్ పోతుంది. ఈ మాట గోపీచంద్ కు కరెక్ట్ గా సరిపోతుంది. ఒకప్పుడు మేచో…

1 year ago

హను-మాన్ మే 12, 2023న పాన్ వరల్డ్ విడుదల

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం 'హను-మాన్‌'. ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్ర…

1 year ago

‘చెప్పాలని ఉంది’ నుండి నీ కోసం పాట విడుదల

ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం 'చెప్పాలని ఉంది'. 'ఒక మాతృభాష కథ' అనేది ఉప శీర్షిక.…

2 years ago

హను-మాన్ టీజర్ లాంచ్ ఈవెంట్

'హను- మాన్' పాన్ వరల్డ్ కంటెంట్ వున్న చిత్రం.. విజువల్ వండర్ గా వుంటుంది  తెలుగులో తొలి జాంబీ చిత్రం జాంబీ రెడ్డి ని రూపొందించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాలను రూపొందించడానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ ని సృష్టించాడు. యంగ్ ట్యాలెంటడ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్ మల్టీవర్స్ నుండి వస్తున్న తొలి చిత్రం. ప్రశాంత్ వర్మ ఇదివరకే తేజ సజ్జ పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఇది సినీ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచింది. తర్వాత పోస్టర్ల ద్వారా ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఈ రోజు ఊహాతీతమైన కంటెంట్ తో వచ్చారు. ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైయింది. జలపాతంకు ఆనుకొని చేతిలో గదతో భారీ హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది. నేపథ్యంలో శ్రీరామ నామం వినిపించింది. కొన్ని జీవురాశులు కొండపై ఒక కాంతిపుంజం చుట్టూ ప్రదక్షణం చేయడం 'సుప్రీమ్ బీయింగ్' రాకను సూచిస్తుంది. సముద్రం ఒడ్డున అపస్మారక స్థితిలో  వున్నట్లుగా తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చాడు. అమృత అయ్యర్ భయపడుతూ చూడటం సూర్యగ్రహణం చెడు యొక్క ఆగమనాన్ని సూచిస్తుంది. వినయ్ రాయ్ 'మ్యాన్ ఆఫ్ డూమ్' గా భయపెట్టాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ కొబ్బరిగెలతో విలన్స్ ని  కొట్టే పెళ్లికూతురుగా ఎంట్రీ ఇచ్చింది. హనుమంతు అండర్‌ డాగ్‌ నుంచి సూపర్‌హీరోగా మారడం విజువల్ వండర్ గా వుంది. గద పట్టుకుని, కొండపై నిలబడి, హెలికాప్టర్‌ సమీపిస్తుండగా ఆకాశంలో ఎగురుతూ తన అతీత శక్తులను చూపిస్తూ.. హనుమంతుడు ఆవహించినట్లు కనిపిస్తోంది. హనుమ తపస్సు చేస్తూ,  రామ నామం జపిస్తున్న చివరి విజువల్స్ మనసులో నాటుకునేలా వున్నాయి. ప్రశాంత్ వర్మ,అతని టీం మాస్టర్ వర్క్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. 121 సెకన్ల టీజర్ విజువల్ వండర్ గా అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లింది. శివేంద్ర తన అద్భుతమైన కెమెరా వర్క్‌తో  స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేశాడు. సంగీత దర్శకుడు గౌరహరి తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో మంత్రముగ్ధుల్ని చేశాడు. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగళ ఒక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు. ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. వీఎఫ్ ఎక్స్  వర్క్ అత్యన్నత క్వాలిటీతో సన్నివేశాలను కొత్త స్థాయికి ఎలివేట్ చేసింది. తేజ సజ్జ సూపర్ హీరోగా చాలా కన్విన్సింగ్‌ గా ఉన్నాడు. అతని గెటప్ , బాడీ లాంగ్వేజ్, యాక్షన్  ప్రతిదీ అద్భుతంగా వుంది. అమృత అయ్యర్ ఏంజెల్ లా కనిపిస్తుంది. మిగతా వారు కూడా పాత్రలను సమర్ధవంతంగా పోషించారు. టీజర్ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఎప్పుడెప్పుడు సినిమాని బిగ్ స్క్రీన్‌లపై చూడాలనే ఆసక్తి నెలకొంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జ మాట్లాడుతూ.. హనుమాన్.. గాలి కంటే వేగంగా ప్రయాణించగలిగిన వారు, బుద్ధిలో శ్రేష్టులు, వానర యోధుల్లో ముఖ్యులు, ఇంద్రియాలని జయించినవారు, సాక్ష్యాత్తు శ్రీరామచంద్రమూర్తి దూత. ఇంతకంటే సూపర్ హీరో మనదగ్గర ఎవరున్నారు.  సూపర్ హీరో అనగానే స్పైడర్ మాన్ సూపర్ మాన్ అని భావిస్తుంటారు. సినిమాలో చూసింది వాళ్ళనే. కానీ వాళ్ళు స్ఫూర్తిపొందింది మన కల్చర్ నుండి, మన హనుమంతులవారి నుండి. వాళ్ళ సూపర్ హీరోలు ఫిక్షనల్ మాత్రమే. హనుమంతులవారు మన చరిత్ర. మన కల్చర్. ఇది మన సత్యం. అలాంటి గొప్ప దేవుడు హనుమంతుడి అనుగ్రహంతో ఒక కుర్రాడికి సూపర్ పవర్ వస్తే ఏం చేస్తాడనేది మా హను మాన్. ఇంతగొప్ప సినిమాలో పాత్రకు న్యాయం చేస్తానని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మగారి కి థాంక్స్ చెప్పడం చిన్న మాటే అవుతుంది. ఆయన తో ఇదివరకే ఒక సినిమా చేశాను. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ గారు గ్రేట్ క్రాఫ్ట్ మాన్. ఆయనతో ప్రతి క్షణం లెర్నింగ్ ప్రాసస్ వుంటుంది. సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. హనుమంతులవారి గురించి చెప్పినపుడు వినయం, నిజాయితీ, గొప్ప అనే మాటలు చెబుతాం. మా సినిమా కూడా అంతే వినయంగా నిజాయితీతో సినిమా చేశాం. కానీ సినిమా చాలా గొప్పగా వుండబోతుంది. ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి సినిమా అంటే చాలా ప్యాషన్. అంత ప్యాషన్ వున్న నిర్మాతకు పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ అందరం చాలా కష్టపడి చేశాం. నాలుగు సినిమాల కష్టం ఈ సినిమా కోసం పడ్డాను. ఈ సినిమా రావడం కూడా దైవ సంకల్పం అని నమ్ముతున్ననాను. త్వరలోనే మీ అందరినీ థియేటర్ లో కలుస్తాం. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నాకు చిన్నప్పటినుండి చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడు. ఆయన పేరు మీద ఇంత పెద్ద సినిమా చేయడం ఆనందంగా వుంది. ఇంత పెద్ద సినిమా చేయడానికి ముందుకు వచ్చిన మా నిర్మాతలు  నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఆరింతలు పెద్దదయ్యింది. ఆయన ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా చేయమని సపోర్ట్ చేశారు. హను మాన్ కేవలం పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా. ఎందుకంటే హనుమంతుడు సూపర్ హీరో. బ్యాట్ మాన్ సూపర్ మాన్ కంటే పవర్ ఫుల్ ఎవరంటే హను మాన్ పేరు చెబుతాం. నాకు చిన్నప్పటి నుండి పౌరాణికాలు చాలా ఇష్టం. నా ప్రతి సినిమాలో ఎదో ఒక రిఫరెన్స్ వుంటుంది. మొదటి సారి పూర్తి స్థాయి పౌరాణిక పాత్ర అయిన హను మాన్ మీద సినిమా చేస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ అని చాలా పాత్రలతో ఒక యూనివర్ష్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పటికే అధీర అనే ఒక సినిమా ప్రకటించాం. ఇవన్నీ మన పురాణాల నుండి స్ఫూర్తి పొందిన పాత్రల ద్వారా రూపొందే చిత్రాలు. హను మాన్ టీజర్ కంటే ట్రైలర్ బావుంటుంది. ట్రైలర్ కంటే సినిమా ఇంకా బావుంటుంది. తేజ సజ్జాతో కలసి జాంబీ రెడ్డి చేశాం. హను మాన్ కి తేజనే ఎందుకు తీసుకున్నామని చాలా మంది అడిగారు. ఈ పాత్ర కోసం ఒక అండర్‌ డాగ్‌ కావాలి. చిన్నప్పటి నుండి తేజ చేసిన పాత్రలు కారణంగా అందరికీ తేజ అంటే పాజిటివ్ ఫీలింగ్ వుంటుంది. అతను చేస్తే బావుంటుందని అందరూ కోరుకుంటారు. తేజకి ఆ ఛార్మ్ వుంది. బడ్జెట్, మార్కెట్ ఏమీ అలోచించకుండా ఈ సినిమా చేశాం. ఈ సినిమాలో పని చేసిన అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి.. అందరికీ థాంక్స్. ఇందులో గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ విలక్షణమైన గెటప్స్ లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త వరల్డ్ క్రియేట్ చేశాం. ఇక్కడి జరిగే కథ. విజువల్ వండర్ గా వుంటుంది. మన సినిమా ఆర్ఆర్ఆర్, కార్తికేయ 2 పాన్ ఇండియా పాన్ వరల్డ్ వెళుతున్నాయి. హను మాన్ కూడా అన్ని భాషల ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమాగా చేశామని నమ్ముతున్నాం. తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ప్రేక్షకులు కూడా ఇది తమ సినిమా అని భావించేలా రూపొందించాం. హను మాన్ పాన్ వరల్డ్ ఫిల్మ్. నిజంగా చాలా గొప్ప సినిమా చేశాం'' అన్నారు అమృత అయ్యర్ మాట్లాడుతూ.. హను మాన్ టీజర్ అద్భుతమనిపించింది. అనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తేజ సజ్జా మీ అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. త్వరలోనే సినిమా థియేటర్లోకి వస్తుంది'' అన్నారు.  ఈ వేడుకలో శ్రీనాగేంద్ర తంగాల, శివేంద్ర, గౌరా హరి, గెటప్ శ్రీను తదితరాలు పాల్గొన్నారు ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు. తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

2 years ago

చిత్రీకరణను పూర్తి చేసుకున్న థ్రిల్లర్ ‘స్పార్క్’

విక్రాంత్ హీరోగా ప‌రిచ‌య‌మవుతున్న భారీ బ‌డ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్‌ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ప్రతి నాయ‌కుడిగా ‘మిన్నల్…

2 years ago