Director Anudeep KV

జాతి రత్నాలు అనుదీప్ కెవి ఇంటర్వ్యూ

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`.  'జాతి రత్నాలు'తో బ్లాక్‌ బస్టర్‌ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో అనుదీప్ విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. మీరు నవ్వరు కానీ జనాల్ని నవ్విస్తారు.. ఆ రహస్యం ఏమిటో ముందు చెప్పండి ? నేనూ నవ్వుతాను. అయితే నవ్వినపుడు కెమరాలు వుండవు. (సరదాగా) `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` ఆలోచన ఎలా మొదలైయింది ? ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని వుండేది. ప్రేక్షకుకుల కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు వుంటుంది. విడుదలకు ముందు తర్వాత మంచి క్రేజ్ వున్న సినిమాలని ఎక్స్ ఫ్లోర్ చేసి.. 'ఖుషి' సినిమా నేపధ్యాన్ని తీసుకుని ఈ కథని చెబుతున్నాం. ఈ కథ మీ జీవితానికి దగ్గర వుంటుందా ? చాలా దగ్గరగా వుంటుంది. టికెట్స్, ఫ్యాన్స్ సంబరాలు ఇవన్నీ దగ్గరుండి చూసినవే. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూసిన  అనుభవాలు ఉన్నాయా ? `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూడకపోతే నాకు సినిమా చూసినట్లే వుండదు. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చూడాల్సిందే. చిన్న టౌన్ లో అదొక గొప్ప ఫీలింగ్. 'పోకిరి' ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి చాలా కష్టపడ్డాను. నాకు పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే వెంకటేష్ గారంటే కూడా ఇష్టం. జాతి రత్నాలు తర్వాత ఇంకా పెద్ద సినిమా ఆలోచన చేయాలి కదా.. మరి కొత్తవారితో ఈ సినిమా చేయడం వెనుక లెక్క ఏమిటి ?  నేను పెద్దగా లెక్కలు వేసుకొను. సినిమా చేసినప్పుడు మజా రావాలి. అంతే. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో` చేసినప్పుడు చాలా మజా వచ్చింది.శ్రీకాంత్ ని ఎలా ఎంపిక చేశారు ? శ్రీకాంత్ మీకు స్నేహితుడని చెప్పారు.శ్రీకాంత్ నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్ లో మంచి హ్యుమర్ వుంటుంది. అతనిలో మంచి ఇంప్రవైజేషన్ వుంటుంది. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`తో మరో జాతిరత్నాలని ప్రేక్షకులు అంచనాలు పెట్టుకోవచ్చా ? తప్పకుండా. `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`లో కూడా హిలేరియస్ హ్యుమర్ వుంటుంది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టే వుంటుంది. కొత్తవాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా వున్నారు.…

2 years ago

హీరో శ్రీకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌ టైన్‌మెంట్ బేన‌ర్‌ లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`.  'జాతిరత్నాలు'తో బ్లాక్‌ బస్టర్‌ ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో కథానాయకుడు శ్రీకాంత్ రెడ్డి విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. మీ నేపధ్యం గురించి చెప్పండి,..అలాగే 'ఫస్ట్ డే ఫస్ట్ షో' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? మాది హైదరాబాద్. అల్వాల్ లో వుంటాను. బిటెక్ పూర్తి చేశాను. బిటెక్ థర్డ్ ఇయర్ నుండే సినిమాల పై ఆసక్తి పెరిగింది. కొన్ని లఘు చిత్రాలు చేశాను. కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. ఈ క్రమంలో పిట్టగోడ ఆడిషన్ లో మెయిన్ లీడ్ గా ఎంపికయ్యాను. అక్కడే అనుదీప్ పరిచయం. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో కూడా మంచి పాత్రల కోసం ఆడిషన్స్ ఇస్తూనే వున్నాను. కథ హీరో అని నమ్ముతాను. మంచి కథలో చిన్న పాత్ర చేసినా తృప్తి వుంటుంది. అలాంటిది చిరంజీవి గారు , కమల్ హసన్ గారు లాంటి గొప్పగొప్ప హీరోలతో గొప్ప క్లాసిక్ చిత్రాలు తీసిన పూర్ణోదయ బ్యానర్ లో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.  వంశీ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. అంతకుముందే అనుదీప్ ఈ కథ గురించి ఒకసారి నాకు చెప్పారు. చాలా అద్భుతమైన కథ. ఆడిషన్స్ ఇచ్చాను. దర్శక నిర్మాతలకు నచ్చింది. తర్వాత ఫోటోషూట్ చేశారు. అందులో సెలెక్ట్ అయిన తర్వాతే ఫైనల్ చేశారు. నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. నాలో ప్రతిభని గుర్తించి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కథ నేపధ్యం గురించి చెప్పండి ? ఈ కథ చాలా రిఫ్రెషింగ్ గా వుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ సాధించడానికి శీను అనే కుర్రాడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది కథాంశం. కథలో అద్భుతమైన సోల్ తీసుకొచ్చారు అనుదీప్. జాతిరత్నాల్లో ప్రతి సీన్ హ్యూమర్స్ గా వుంటుంది. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కూడా ప్రతి సీన్ హిలేరియస్ గా వుంటుంది. నారయణఖేడ్, శంకర్ పల్లి, చేవెళ్ళ ప్రాంతాల్లో ఖుషి సినిమానాటి వాతావరణం రిక్రియేట్ చేసేలా వింటేజ్ లుక్ లో షూట్ చేశాం. అనుదీప్ నారయణఖేడ్ ప్రాంతంలో పెరిగారు. ఆయన రాసే కథలు ఆ ప్రాంతం చుట్టూ జరిగేవే, అక్కడ ఆయన చూసిన వాతావరణంకు తగ్గట్టు లోకేషన్స్ ని ఎంచుకున్నాం. హాస్య ప్రధానమైన పాత్ర చేయడం ఎలా అనిపించింది ? కథలో నాకు నచ్చిన అంశం హాస్యం. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్. నా పాత్ర చాలా హిలేరియస్ గా వుంటుంది. ఇందులో నా పాత్ర చేయడానికి వంశీ, అనుదీప్, శ్రీజ గారు చాలా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. దాదాపు 20 రోజులు వర్క్ షాప్ చేశాం. ఈ పాత్రని  చాలా ఎంజాయ్ చేశా. ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించారు.. రియల్ లైఫ్ లో ఎవరి ఫ్యాన్ ? పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం. అలాగే సూర్య గారు అంటే కూడా ఇష్టం. 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చూసిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నయా ? పోకిరి, అత్తారింటికి దారేది, సూర్య గారి సినిమాలు 'ఫస్ట్ డే ఫస్ట్ షో' చుసిన అనుభవాలు వున్నాయి. టికెట్లు దొరక్కపొతే గోడలు దూకి పోలీసులతో దెబ్బలు తిన్న సందర్భాలు కూడా వున్నాయి. ఐతే నా కంటే నా ఫ్రండ్స్ ఎక్కువ దెబ్బలు తిన్నారు. (నవ్వుతూ) 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కి ఇద్దరు దర్శకులు కదా.,,. ఇద్దరి దర్శకులతో పని చేయడం ఎలా అనిపించింది ? ఈ కథ సోల్ ని అనుదీప్ ఎంతలా అర్ధం చేసుకున్నారో వంశీ కూడా అంతే సమానంగా అర్ధం చేసుకున్నారు. అనుదీప్ శివకార్తికేయన్ గారి సినిమాతో బిజీ గా వుండటం వలన టెక్నికల్ గా స్ట్రాంగ్ గా వుండే లక్ష్మీనారాయణను మరో దర్శకుడిగా ఎంపిక చేశారు. వంశీ, లక్ష్మీ ఇద్దరూ గొప్ప సమన్వయంతో పని చేశారు. ఎవరి చేతిలో మైక్ వుంటే వాళ్ళే యాక్షన్ కట్ చెప్పేవారు. లక్ష్మీ నాకు టెక్నికల్ గా సపోర్ట్ చేస్తే.. వంశీ యాక్టింగ్ పరంగా హెల్ప్ చేశారు. తనికెళ్ళ భరణి గారితో పని చేయడం ఎలా అనిపించింది ?…

2 years ago

‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసిన నేచురల్ స్టార్ నాని

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ రొమ్-కామ్ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే…

2 years ago