Reviews

భోళా శంకర్ రివ్యూ

రివ్యూ : భోళా శంకర్
తారాగణం : చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, తరుణ్ అరోరా, సుశాంత్, మురళీశర్మ, బ్రహ్మానందం, రఘుబాబు, గెటప్ శ్రీను తదితరులు
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకేటేష్
సంగీతం :
మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ : డడ్లీ
నిర్మాతల : రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం : మెహర్ రమేష్

వాల్తేర్ వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి మరో సినిమా అంటే ఎక్స్ పెక్టేషన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ ఎందుకో భోళా శంకర్ పై అలాంటివి ముందు నుంచీ కనిపించలేదు. పాటలేవీ ఆకట్టుకోలేదు. టీజర్ కేవలం ఎలివేషన్స్ కు సరిపోయింది. ట్రైలర్ అయినా బావుంటుందా అంటే అదీ రొటీన్ గానే కనిపించింది. దీంతో ఈ మధ్య ఎప్పుడూ లేనంతగా మెగాస్టార్ మూవీకి భారీ బజ్ కనిపించలేదు. అందుకు ప్రధాన కారణాలు ఇది రీమేక్ కావడం.. దర్శకుడు మెహర్ రమేష్ కావడమే అంటూ కొన్ని విశ్లేషణలు చేశారు. బట్ మెగా మూవీ అంటే ఓపెనింగ్స్ అయితే గ్యారెంటీ కదా.. అవెలా ఉన్నా.. ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ భోళా శంకర్ ఎలా ఉందో చూద్దాం..

కథ :
శంకర్( చిరంజీవి) తన చెల్లి మహాలక్ష్మితో కలిసి కోల్ కతాకు వెళతాడు. అక్కడ తన చెల్లికి ఆర్ట్స్ కాలేజ్ లో సీట్ సంపాదించి టాక్సీ నడుపుతుంటాడు. అదే టైమ్ లో కోల్ కతాలో వరుసగా అమ్మాయిల కిడ్నాప్ జరుగుతుంటుంది. ఒక ముఠా అమ్మాయిలను విదేశాలకు అమ్మేస్తూ ఉంటుంది. వారి ఆచూకి చెప్పమని పోలీస్ లు టాక్సీ, ఆటో డ్రైవర్స్ కు ఓ మీటింగ్ పెడతారు. వారి ఫోటోస్ కూడా ఇస్తారు. ఆ ఫోటోలో ఉన్న ఓ కిడ్నాపర్ ను చూసిన శంకర్ పోలీస్ లకు సమాచారం ఇస్తాడు. పోలీస్ ల దాడి చేసి కొందరిని పట్టుకుంటారు. ఈ సమాచారం ఇచ్చిన శంకర్ కు చంపేయమని ముఠా లీడర్ అలెక్స్ చెబుతాడు. శంకర్ ను కనిపెట్టి చంపాలనుకుంటున్న టైమ్ లో తనే వారందరినీ చంపేస్తాడు.ఆ గ్యాంగ్ లో మెయిన్ విలన్ తమ్ముడుంటాడు.మరోవైపు శంకర్ చెల్లిని శ్రీకర్(సుశాంత్) ఇష్టపడితే పెళ్లికి సన్నాహాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే తన తమ్ముడిని చంపాడని ఒక అన్న శంకర్ ను వెదుకుతూ వచ్చి తనూ చనిపోతాడు.అంతేకాదు.. అసలు విలన్ అయిన అలెగ్జాండర్ ను కూడా చంపేస్తానని.. సవాల్ చేస్తాడు. ఇదంతా శ్రీకర్ చెల్లి లాస్య(తమన్నా)చూస్తుంది. అప్పుడు ఆమెకు తను వాళ్లను ఎందుకు చంపుతున్నాడో చెబుతాడు శంకర్. పైగా మహాలక్ష్మీ తన చెల్లి కాదని కూడా చెబుతాడు. మరి మహాలక్ష్మీ ఎవరు..? ఎందుకు కోల్ కతా వచ్చాడు. వీళ్లందరినీ చంపడానికి కారణం ఏంటీ అనేది మిగతా కథ.

విశ్లేషణ :
భోళా శంకర్ ట్రైలర్ చూసినప్పుడే ఇది అవుట్ డేటెడ్ అనిపించింది. సినిమాలోనూ అదే కనిపిస్తుంది. అస్సలే మాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో మెగా ఫ్యాన్స్ ను సైతం ఇబ్బంది పెట్టే విధంగా రూపొందించాడు దర్శకుడు మెహర్ రమేష్. తమిళ్ లో వచ్చిన వేదాళం చిత్రానికి రీమేక్ అయిన ఈ మూవీలో అనేక మార్పులు చేశాం అని చెప్పారు. కానీ అవన్నీ 90ల కాలం నాటి మార్పులు. ఆ కాలంలో రావాల్సిన కథనం ఇది. అంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి ఉన్నాం. ఇలాంటి కథ, కథనాలతో మెగాస్టార్ ఇమేజ్ ను ఛరిష్మాను నమ్ముకుని మెహర్ రమేష్ ధైర్యం చేశాడు. కానీ వర్కవుట్ అవుతుందని చెప్పలేం. ఏ దశలోనూ కథలో హై మూమెంట్స్ కనిపించవు. పాటలన్నీ ఫోర్స్ డ్ గా కనిపిస్తాయి. చిరంజీవి హీరో కాబట్టి ఆయన్నుంచి ఆడియన్స్ డ్యాన్సులు ఎక్స్ పెక్ట్ చేస్తారు కాబట్టి పాటలు ఉండాలి అన్నట్టుగా ఉంది తప్ప అవేవీ ఆకట్టుకునేలా లేవు. మామూలుగా ఆల్బమ్ మైనస్ అంట సినిమలో ప్లేస్మెంట్ కూడా సరిగా లేదు. తమన్నా ట్రాక్ పరమరొటీన్. ఇక చిరంజీవి చుట్టూ ఉన్న గ్యాంగ్, ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో సైతం పురాతమైన ఫార్ములానే. చూడ్డానికి చాలామంది కమెడియన్స్ ఉన్నా.. ఒక్కరూ కామెడీ పండించలేదు.ఆ బాధ్యత కూడా తనదే అన్నట్టుగా మెగాస్టార్ ఒన్ మేన్ షోలా నడిపించే ప్రయత్నం చేశారు.ఇదీ కొంత మైనస్ అయింది. ఎవరి పని వారికి ఇస్తే పోయేదానికి కామెడీ, ఫైట్లు, పాటలు, సెంటిమెంట్ అన్నీ ఆయనే చేస్తే మరి చుట్టూ అంతమంది ఎందుకో అర్థం కాదు.విలన్స్ వారి గ్యాంగ్ చేసే పనులు అన్నీ అవుట్ డేటెడ్ అంశాలే. ఫ్లాష్ బ్యాక్ కొంత వరకూ మెప్పిస్తుంది. అందుకు కారణం.. ఇది ఒరిజినల్ లో ఉన్న పాయింట్ కాబట్టే.ఓ కిరాయి రౌడీ కథ ఇది. ఇక్కడే తనకు మహాలక్ష్మీ పరిచయం కావడం వారితో తనకు తెలియకుండానే ఓ మంచి బంధం ఏర్పడటం ఆ బంధం కోసమే అతను కోల్ కతా వరకూ రావడం అనేది సెకండ్ హాఫ్ లో కనిపించే కథ. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే ఇది బెటర్ అనిపిస్తుంది.శ్రీముఖితో చేసిన ఖుషీ సీన్ రీ క్రియేషన్ గురించి చాలా చెప్పారు అంత గొప్పగా ఏం లేదు. అలాగని బాలేదు అని కూడా చెప్పలేం.మురళీశర్మ క్యారెక్టర్ అతి మంచివాడుగా చూపించారు. ఇక క్లైమాక్స్ పరమ రొటీన్. ఓవరాల్ గా చూస్తే జస్ట్ యావరేజ్ మూవీలా అనిపిస్తుంది. అది కూడా చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మాత్రమే.
భోళా శంకర్ గా మెగాస్టార్ ఒన్ మేన్ షో ఇది. ఇలాంటివి ఆయనకు కొట్టిన పిండి తరహా పాత్రలు. బట్ కథలో దమ్ము లేనప్పుడు ఆయన ఎంత షో చేసినా ఉపయోగం ఉండదు కదా.. చెల్లి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయింది. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా ఓకే. తమన్నా హీరోయన్ పాత్రకు సెట్ అవలేదు. లేదా ఆ పాత్రకు సెట్ అయ్యేంత లెంగ్త్ లేదు. విలన్ గా తరుణ్ అరోరా రొటీన్, కమెడియన్స్ అంతా జస్ట్ జూనియర్ ఆర్టిస్టుల్లా గుంపులుగా ఉన్నారు కానీ ఒక్కరూ నవ్వించే పాత్ర కాదు.

టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ బావుంది. మ్యూజిక్ మైనస్. నేపథ్య సంగీతం కూడా గొప్పగా ఏం లేదు. ఎడిటింగ్ ఓకే. మాటలు ఒక్కటీ ఆకట్టుకోదు. ఆర్ట్ వర్క్, సెట్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. ఇక దర్శకుడు మెహర్ రమేష్ కు ఇది కమ్ బ్యాక్ మూవీ అవుతుందనుకున్నారు. బట్ కాలేదు. ఇంకా చెబితే అతని గత సినిమాలే బెటర్ అనేలా ఉంది. అతను ఏ మాత్రం స్టడీ చేయలేదు ఈ మూవీ గురించి. కేవలం హీరో ఇమేజ్ తో లాగించేద్దాం అనే ఫీలింగ్ తో రూపొందించినట్టుగా కనిపించింది. బట్ ఇది వర్కవుట్ అవుతుందని చెప్పలేం. మెహర్ రమేష్ గత సినిమాలు పోయినా.. ఓ స్టైలిష్ టేకింగ్ కనిపించేది. ఇందులో అదీ మిస్ అయింది.

ఫైనల్ గా : ఓన్లీ ఫర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్

Rating- 2/5

– బాబురావు. కామళ్ల

Telugu 70mm

Recent Posts

జూన్ 14న రాబోతున్న సుధీర్ బాబు ‘హరోం హర‘

యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ ‘హరోం హర‘. ఈ సినిమాలో సుధీర్ బాబు కి జోడీగా మాళవిక…

15 mins ago

మరోసారి ‘గాడ్ ఫాదర్‘ కాంబినేషన్

మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్‘ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ మోహన్ రాజా. మలయాళం చిత్రం ‘లూసిఫర్‘ రీమేక్ గా రూపొందిన…

18 mins ago

బేబి బంప్‌తో దర్శనమిచ్చిన దీపిక పదుకొనె

బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ ఒక్కొక్కరిగా పెళ్లి పీటలెక్కడం.. పిల్లలను కనడం చూస్తూనే ఉన్నాం. ఈ లిస్టులో దీపిక పదుకొనె కూడా…

2 hours ago

‘ఎన్టీఆర్-నీల్’ అనౌన్స్‌మెంట్ తో సస్పెన్స్ లో ‘సలార్ 2’

ఒక సినిమా చేసి.. బోనస్ గా మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేస్తున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్…

2 hours ago

బెంగళూరు రేవ్ పార్టీలో జానీ మాస్టర్?

ఎక్కడ ఎలాంటి పార్టీ జరిగినా ముందుగా గుర్తొచ్చేది సినిమా వాళ్లే. ఇక.. లేటెస్ట్ గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ…

3 hours ago

‘గం గం గణేశా’ ట్రైలర్.. ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ

'బేబి' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వస్తోన్న మూవీ 'గం గం గణేశా'. ఈ మూవీలో ప్రగతి…

3 hours ago