‘మ్యాడ్‘ డైరెక్టర్ కి సితార డబుల్ ధమాకా!

కొత్తదనానికి చిరునామాగా నిలుస్తుంటారు నవతరం దర్శకులు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచడంలో వారెప్పుడూ ముందుంటారు. ఈకోవలోనే ‘మ్యాడ్‘ మూవీతో యూత్ పల్స్ ను బాగా పట్టుకున్నాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ‘మ్యాడ్‘ మూవీని తీర్చిదిద్ది బడా హిట్ కొట్టాడు.

‘మ్యాడ్‘ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్.. కళ్యాణ్ శంకర్ తో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను లైన్లో పెట్టిందట. వాటిలో ఒకటి ‘మ్యాడ్ 2‘ కాగా.. మరొకటి శర్వానంద్ హీరోగా తెరకెక్కనుందట. ఇప్పటికే ‘మ్యాడ్ 2‘కి సంబంధించి స్క్రిప్ట్ పనులు చకచకా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ‘మ్యాడ్ 2‘ ఫినిష్ అయిన తర్వాతే శర్వానంద్ సినిమా పట్టాలెక్కనుందట.

Related Posts