అన్నపూర్ణ ఫోటో స్టూడియో.. అమ్మాయిని చంపేయాలి..

21వెడ్స్ 30 ఫేమ్ చైతన్యరావు హీరోగా నటిస్తోన్న సినిమా అన్నపూర్ణ ఫోటో స్టూడియో. లావణ్య హీరోయిన్. చెందు ముద్దు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యశ్ రంగినేని నిర్మించాడు. కొన్నాళ్లుగా ఒక్కో పాట విడుదల చేస్తూ ఆకట్టుకుంటోన్న ఈ మూవీ టీమ్ లేటెస్ట్ గా డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేసింది.

90స్ బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అని ముందు నుంచీ చెబుతున్నారు వీళ్లు. అందుకు తగ్గట్టుగానే గోదావరి పక్కన ఉన్న కపిలేశ్వరపురం అనే గ్రామంలో సాగే కథగా కనిపిస్తోంది. ఆ ఊరిలో ఒక ఫోటో స్టూడియో. దాని ఓనర్ తన స్టూడియోకు అమ్మ పేరు పెట్టుకున్నా ఫోటో మాత్రం అక్కినేని నాగేశ్వరరావు గారిది పెట్టుకుంటాడు.

తను ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. తనూ ప్రేమిస్తుంది. అదే టైమ్ లో అతను చేసిన ఓ పని వల్ల ఆ అమ్మాయి అతన్ని వదిలేసి వెళుతుంది. వెళ్లేముందు అతన్ని కొడుతుంది కూడా. దీంతో తనను వదిలి వెళ్లిందన్న కారణంతో ఆ అమ్మాయిని చంపాలని డిసైడ్ అవుతాడు. మరి నిజంగా అతను చంపేంతగా అమ్మాయి ఏం చేసింది..? అసలు చంపడం అనేది మామూలుగా అన్నాడా లేక సీరియస్ గా అన్నాడా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు.


బట్ ఈ టీజర్ చూస్తున్నంత సేపూ ఏమంత కొత్తదనం అయితే కనిపించడం లేదు అనే చెప్పాలి. అప్పటి బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టుగా యాంబియన్స్ సెట్ చేశార కానీ.. పాత్రల యాటిట్యూడ్ మాత్రం ఇప్పటి లానే ఉంది. ఆర్టిస్టుల యాటిట్యూడ్ సైతం అలాగే కనిపిస్తోంది. ఇక ఆ నాటి కార్లు, సైకిళ్లు వాడినంత మాత్రాన ఆ కాలానికి వెళ్లినట్టే అనుకుంటే అది సెట్ ప్రాపర్టీస్ అవుతాయి తప్ప సెట్ ఆఫ్ స్టోరీ అవదు. మరి టీజర్ తోనే తొందరపడలేం కానీ.. సినిమా చూస్తే కానీ అసలు ఈ ఫోటోస్టూడియోవాళ్లు సినిమా ఎలా తీశారో అర్థం కాదు.

Related Posts