‘భీమా’ టీజర్.. రాక్షసులను వేటాడే బ్రహ్మరాక్షసుడు

మ్యాచో స్టార్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘భీమా’. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కన్నడ డైరెక్టర్ ఎ.హర్ష దర్శకుడు. కన్నడలో పలు విజయవంతమైన సినిమాలు తీసి యాక్షన్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించాడు హర్ష. ఇక.. సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘భీమా’ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ‘భీమా’ టీజర్ విడుదల చేసింది టీమ్. గోపీచంద్ పోలీస్ అవతార్ లో రాక్షసులను వేటాడే బ్రహ్మరాక్షసుడు గా ఎంట్రీ ఇచ్చిన విజువల్స్ అదిరిపోయాయి. టీజర్ చివరిలో ఓ ఎద్దుపై గోపీచంద్ పోలీస్ డ్రెస్ లో కూర్చున్న తీరు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

‘కె.జి.యఫ్, సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకి మరో ప్లస్. ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ తో పాటు ‘భీమా’ మూవీ రిలీజ్ డేట్ పైనా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఫిబ్రవరి 16న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts