ఎన్టీఆర్-హృతిక్ ‘వార్ 2‘ రిలీజ్ డేట్ ఫిక్స్

విడుదల తేదీల విషయంలో బాలీవుడ్ మేకర్స్ ఎంతో పక్కాగా ఉంటారు. ఏడాది, రెండేళ్ల తర్వాత వచ్చే సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటిస్తుంటారు. ఈకోవలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ‘వార్ 2‘ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. యాశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ లో ఆరవ చిత్రంగా ‘వార్ 2‘ రాబోతుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ గా రూపొందుతోన్న ఈ సినిమాని 2025, ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది నిర్మాణ సంస్థ.

This image has an empty alt attribute; its file name is image-138.png

2025 ఇండిపెండెన్స్ డే కానుకగా లాంగ్ వీకెండ్ ను టార్గెట్ చేస్తూ ‘వార్ 2‘ రాబోతుంది. అంటే.. ఈ సినిమా విడుదల తేదీకి ఇంకా ఏడాదిన్నరకు పైగానే సమయం ఉందన్నమాట. ‘బ్రహ్మాస్త్ర‘ ఫేమ్ అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుంది. మెయిన్ కాస్ట్ తారక్, హృతిక్ డూప్స్ తోనే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడట డైరెక్టర్ అయన్ ముఖర్జీ. ప్రస్తుతం ‘దేవర‘ చిత్రీకరణలో ఉన్న ఎన్టీఆర్.. ‘ఫైటర్‘ షూటింగ్ లో ఉన్న హృతిక్ త్వరలోనే ‘వార్ 2‘ సెట్స్ లో జాయిన్ కానున్నారట.

Related Posts