కిరణ్ అబ్బవరం రహస్య నిశ్చితార్ధం

హిట్స్ ఫట్స్‌ కు అతీతంగా కెరీర్‌లో దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. పక్కింటి కుర్రాడిలా.. మంచితనానికి మారుపేరులా కనిపించే ఈ అబ్బాయి రహస్య వివాహం జరగబోతుంది. అంటే రహస్యంగా వివాహం చేసుకోవడం కాదు.. రహస్య అనే అమ్మాయితో వివాహం జరగబోతుంది.

ఈ రహస్య ఎవరో కాదు.. కిరణ్‌ అబ్బవరంతో రాజావారు రాణిగారు సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ రహస్య. వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నారు.వీరి వివాహ నిశ్చితార్ధం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి డేట్ ను , వేదికను త్వరలో అనౌన్స్‌ చేస్తారని తెలిపారు

Related Posts