ఈ బజ్ ను నిలబెట్టుకుంటారా..

ఇవాళా రేపూ చిన్న సినిమాలకు బజ్ క్రియేట్ కావడం అంటే అదో పెద్ద గొప్ప విషయంగా మారింది. ఈ సినిమా వెనక ఎవరున్నా.. ఆడియన్స్ అటెన్షన్ సంపాదించడం అంటే చిన్న విషయం కాదనే చెప్పాలి. ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయింది. ముందు పాటలతో ఆకట్టుకున్నారు. టీజర్ ఇంప్రెస్ చేసింది. ట్రైలర్ తో స్పెల్ బౌండ్ అయ్యారు ఆడియన్స్.

ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే అనే ఫీలింగ్ కేవలం ట్రైలర్ తోనే కలిగించారు. చూడ్డానికి ట్రైయాంగిల్ లవ్ స్టోరీలా కనిపిస్తున్నా.. అంతకు మించిన పెయిన్ ఏదో ఈ కథలో ఉన్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే కంటెంట్ లా ఉంది. అదే టైమ్ లో ప్రేమలో పడిన ప్రతి ఒక్కరినీ మెప్పించేలానూ ఉంది. ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా కనిపించిన ట్రైలర్ ఈ మధ్య కాలంలో ఇదే.

అందుకే ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా అయ్యాయి. కొన్ని థియేటర్స్ లో రెండు మూడు రోజుల వరకూ బుకింగ్స్ అయిపోయాయి అంటే అది ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అనే చెప్పాలి.
అయితే రిలీజ్ కు ముందు క్రేజ్ తెచ్చుకుని.. మంచి బజ్ క్రియేట్ చేసిన సినిమాలు ఆ మ్యాజిక్ ను థియేటర్స్ లో కూడా చూపుతాయి అనే గ్యారెంటీ లేదు.

ఈ విషయంలో ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే ఇలాంటప్పుడు ఎంత బజ్ వస్తుందో అంత సమస్య కూడా ఉంటుంది. ఒకవేళ సినిమా జెన్యూన్ గా బావుంటే.. పది కోట్లు వస్తాయనుకున్నప్పుడు అంతకు డబుల్ వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఎటొచ్చీ.. ఇలా రిలీజ్ కు ముందు వచ్చిన బజ్ ను నిలబెట్టుకోవడం అనేది కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. మరి ఈ బేబీ ఈ బజ్ ను నిలబెట్టుకుంటుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

Related Posts