స్టార్ హీరోకు ఫైన్ వేసిన పోలీస్ లు

చట్టానికి అందరూ సమానమే అంటారు. కానీ కొందరు మాత్రం అప్పుడప్పుడూ కాస్త తక్కువ సమానం అవుతారు. బట్ మాగ్జిమం కొన్ని రూల్స్ మాత్రం అందరికీ వర్తిస్తాయి. ఒకప్పుడు అంటే చెప్పలేం కానీ ఆటోమేటిక్ ఫోటో క్యాప్చర్స్ వచ్చిన తర్వాత వ్యక్తులతో సంబంధం లేకుండానే ఫైన్లు పడిపోతున్నాయి.

లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ కార్ కి కూడా ఫైన్ పడింది. రెడ్ సిగ్నల్ జంప్ చేశారని చెన్నై ట్రాఫిక్ పోలీస్ లు విజయ్ కి 500 రూపాయలు ఛలానా విధించారు. ఈ సోమవారం విజయ్ తన లేటెస్ట్ మూవీ ‘లియో’ డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోకు వెళుతుండగా ఈ సిగ్నల్ జంపింగ్ పడింది. దీంతో పోలీస్ లు ఫైన్ విధించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇక లియోకు సంబంధించి వస్తే.. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. విజయ్ డబ్బింగ్ స్టార్ట్ చేశాడు కాబట్టి.. ఇక రిలీజ్ డేట్ లో ఏ మార్పులూ ఉండవు అనుకోవచ్చు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉంది.

బిజినెస్ కూడా ఊహించని రేంజ్ లో అవుతోంది. కొన్ని చోట్ల విజయ్ కి మార్కెట్ లేకపోయినా భారీగానే అడుగుతున్నారు. లియో లో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు.

ఇతర కీలక పాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ మీనన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, అనురాగ్ కశ్యప్ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Related Posts