పాట వస్తుందా .. బిజినెస్ మేన్ తో సరిపెట్టుకోవాలా

మహేష్ బాబు బర్త్ డే దగ్గరకు వచ్చింది. ఈ నెల 9న ఆయన పుట్టిన రోజును విదేశాల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా రోజుల క్రితమే వెకేషన్ కు వెళ్లాడు. ప్రస్తుతం స్కాంట్లాండ్ లో ఉన్నారు మహేష్ ఫ్యామిలీ.బర్త్ డే అంటే కొత్త సినిమాల అప్డేట్స్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఆ మేరకే ఫ్యాన్స్ అంతా గుంటూరు కారం పాటను ఆశించారు.

అయితే ఈ పాట రెడీ కావడం బాగా ఆలస్యం అయింది. మొదట థమన్ ను తీసేస్తారు అనే ప్రచారం జరగడమే పెద్ద సమస్య అయింది. అయినా త్రివిక్రమ్ సర్ది చెప్పడంతో మహేష్ ఓకే అన్నాడు. అప్పుడు మళ్లీ రంగంలోకి దిగిన తమన్ కొత్త ట్యూన్స్ ఇచ్చాడు.ఈ ట్యూన్స్ లో రెండు మూడు రిజెక్ట్ అయ్యాయి అన్నారు. చివరగా ఓ ట్యూన్ త్రివిక్రమ్ తో పాటు అతని టీమ్ కు కూడా నచ్చింది. దాన్ని మహేష్ కు పంపించారు. ఆయన్నుంచి ఓకే అనే మాట వస్తే ఆ పాటను మహేష్ బర్త్ డే రోజు విడుదల చేస్తారు. ఇంకా సూపర్ స్టార్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.


అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ పాట వస్తే బావుంటుంది అనుకుంటున్నారు. అయినా బర్త్ డే రోజు బిజినెస్ మేన్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దానితో సరిపెట్టుకోవలా అని ఆలోచిస్తున్నారు. నిజంగా ఓ కొత్త అప్డేట్ వస్తేనే కిక్ ఉంటుంది కానీ.. ఇలా పాత సినిమాలను మళ్లీ చూస్తే రాదు. ఇది కేవలం రీ రిలీజ్ ల ట్రెండ్ లో వస్తున్న ఆలోచనే తప్ప నిజంగా బిజినెస్ మేన్ ను ఇప్పటికే చాలామంది చాలాసార్లు చూశారు. ఇందులోని డైలాగ్స్ కోసమే యూ ట్యూబ్ లో అదే పనిగా చూసేవారూ ఉన్నారు. అలాంటి సినిమాను అభిమానంతో చూస్తారు. గుంటూరు కారం నుంచి కొత్తగా పాట వస్తే ఆనందంగా చూస్తారు. మరి వారిని ఆనందింప చేస్తారా లేక అభిమానంతో సరి పెట్టుకోమంటారా అనేది చూడాలి.

Related Posts