కళ్యాణ్ డెవిల్ రిలీజ్ డేట్ ఇదే

బింబిసారతో మెమరబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు కళ్యాణ్ రామ్. ఈ సోషియో ఫాంటసీతో అందుకున్న విజయం అతనికి కొత్త ఉత్సాహం తెచ్చింది. తర్వాత వచ్చిన అమిగోస్ పోయినా ఆ ఎఫెక్ట్ అతనిపై పడలేదు. ఇక ఇప్పుడు డెవిల్ అనే సినిమాతో వస్తున్నాడు.

ఇదో పీరియాడిక్ డ్రామా. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీష్ వారి ఏజెంట్ గా పనిచేసిన డెవిల్ అనే వ్యక్తి పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా వచ్చిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అతనికి మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనిపించుకుందీ టీజర్.

సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్నాడు. అభిషేక్ నామా నిర్మాత. ఈ మూవీని హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా హిందీలో రిలీజ్ చేసిన టీజర్ కు అక్కడా మంచి స్పందన వచ్చింది. యూనిక్ కంటెంట్ లా కనిపిస్తోంది కాబట్టి ప్యాన్ ఇండియన్ రేంజ్ లోవిడుదల చేసినా ఆశ్చర్యం లేదు.ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.


నవంబర్ లో ఇప్పటి వరకూ ఏ పెద్ద సినిమా అనౌన్స్ కాలేదు.అయితే మధ్య లో దీపావళి లాంటి ఫెస్టివ్ సీజన్ ను కాదని 24 వరకూ ఎందుకు వెళ్లారో కానీ డెవిల్ ను డీ కోడ్ చేసేది నవంబర్ 24న అని తేలిపోయింది.

Related Posts