అల్లు అర్జున్ ఆర్మీకి ఆగ్రహం వచ్చింది..

అభిమానులు అంతే.. ఆగ్రహం వచ్చినా ఆనందం వచ్చినా ఆగరు. కాకపోతే వారి ఆగ్రహం హీరోల మీద కాక నిర్మాణ సంస్థలు, దర్శకుల మీద చూపిస్తుంటారు ఇదే ఇబ్బంది. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా యూవీ క్రియేషన్స్ పై ఇలాగే ఆగ్రహంతో రెచ్చిపోయారు. వారిపై నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. వీరు కొన్నాళ్లుగా పుష్ప2కు సంబంధించిన అప్డేట్ కోసం చూస్తున్నారు.

కానీ ఇప్పటి వరకూ సుకుమార్ కానీ మైత్రీ వాళ్లు కానీ ఏ అప్డేట్ ఇవ్వడం లేదని కోపంగా ఉన్నారు. నిజానికి ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కానీ అది ఏ దశలో ఉంది. మ్యూజిక్ పరిస్థితి ఏంటీ.. టీజర్ లేదా సాంగ్ లాంటివి వచ్చేది ఏమైనా ఉందా అనే అప్డేట్స్ అభిమానులకు అస్సలు లేవు. దీంతో అసలేం జరుగుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అందుకే ” వేకప్ టీమ్ పుష్ప2″ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.


మరి అల్లు అర్జున్ అభిమానులు అప్డేట్ అంటూ ఏం ఆశిస్తున్నారో కానీ ఈ మూవీ షూటింగ్ నిన్నటి(శనివారం) నుంచి హైదరాబాద్ లోనే వేసిన ఓ సెట్ లో రీ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ తో పాటు మిగతా టీమ్ అంతా పార్టిసిపేట్ చేస్తుంది.ఇది కాక ఇంకేదైనా ఉంటే వారు చేసే హ్యాష్ ట్యాగ్ కు మేకర్స్ రియాక్ట్ కావాల్సి ఉంటుంది.

Related Posts