యాత్రకు సైతాన్ అడ్డు పడుతుందా.. ?

ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. వాళ్లు పర్టిక్యులర్ జానర్స్ లో ఎక్స్ పర్ట్స్ అయి ఉంటారు. బట్ కొందరుంటారు. అన్ని జానర్స్ లో స్క్రిప్ట్ వేస్తుంటారు. అలా తెలుగులో మహి వి రాఘవ కూడా వెళుతున్నాడు. ఫస్ట్ మూవీ పాఠశాలను ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ఆనందో బ్రహ్మతో మంచి హిట్ కొట్టాడు.

డిఫరెంట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఆకట్టుకుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి లైఫ్ లోని ఓ కీలక ఘట్టమైన పాదయాత్రను వెండితెరపైకి ఎక్కించి అతను విపరీతమైన ప్రశంసలు అందుకున్నాడు.

ఈ చిత్రం కమర్షియల్ కూడా ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత ఎందుకో లాంగ్ గ్యాప్ వచ్చింది. వచ్చిందా.. తీసుకున్నాడా అనేది తెలియదు కానీ.. రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ ను నిర్మించాడు. ఇది బాగా క్లిక్ అయింది. అయితే ఆ వెంటనే తన దర్శకత్వంలో అదే ఓటిటి ప్లాట్ ఫామ్ లో రీసెంట్ గా సైతాన్.. అనే వెబ్ సిరీస్ రూపొందించాడు.

ఈ సిరీస్ ట్రైలర్ వచ్చినప్పుడే చాలామంది రాఘవను విమర్శించారు. మరీ ఇంత నేలబారుగా ఉందేంటీ అంటూ విమర్శించారు. అయితే ట్రైలర్ చూసి జడ్జ్ చేయడం కాదు సిరీస్ చూడమన్నాడు. బట్ సిరీస్ ఇంకా నేలబారుగా ఉంది. అస్సలే మాత్రం ఆకట్టుకోలేకపోయిన కంటెంట్, సైకోలు కూడా అసహ్యించుకునే కథనంతో పరమ నాసిరకంగా ఉంది ఈ ఈ సిరీస్.

అయితే సీరీస్ లో బూతులకు మాత్రం కొదవ లేదు. పోనీ అవేమన్నా సందర్భానుసారంగా వచ్చాయా అంటే అదీ లేదు. కావాలనే ఆ బూతులు వాడినట్టుగా ఉంది తప్ప సహజంగా అనిపించలేదు. దీంతో ఈ సైతాన్ సిరీస్ జుగుప్సాకరంగా ఉందనే తేల్చారు ఆడియన్స్.


అయితే ఇప్పుడు అదే మహి వి రాఘవ మరో పాద ”యాత్ర”కు శ్రీకారం చుడుతున్నాడు. అప్పుడు తండ్రి. ఇప్పుడు కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర నేపథ్యంలో యాత్ర2 సినిమా అనౌన్స్ చేశాడు. బట్ ఈ యాత్ర2 కు ఖచ్చితంగా అతనికి సైతాన్ అడ్డుపడుతుందనే చెప్పాలి. ప్రస్తుతం ఏపిలో ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా.. అప్పుడు ఆ హీట్ కనిపిస్తోంది. అలాంటి తరుణంలో యాత్ర వంటి మంచి మూవీ చేసిన దర్శకుడు యాత్ర2కు శ్రీకారం చుడితే ఇదో బూతు దర్శకుడు తీసిన సినిమా అన్న ట్యాగ్ ను ప్రతిపక్షాలు వేస్తాయి.

అదే టైమ్ లో ఈ పాద యాత్ర టైమ్ లో జగన్ ఇచ్చిన హామీల్లో ఏ మాత్రం నెరవేరనివి చాలా ఉన్నాయి. అవన్నీ చూపిస్తే .. ఇప్పుడు జగన్ ను ఎందుకు చేయలేదు అని జనం ప్రశ్నిస్తాడు. చూపించకపోతే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. నిజంగా యాత్ర2 కమర్షియల్ గా మంచి సినిమానే అవుతుంది. బట్.. దీనికి ముందు చేసిన సైతాన్ వల్ల మహి వి రాఘవ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అలాంటి ఇమేజ్ తో ఇలాంటి సినిమా చేస్తే ఖచ్చితంగా మైనస్ అవుతుంది తప్ప ప్లస్ కాదు. మరి ఈ పాదయాత్రను పూర్తిగా చూపిస్తారా లేక జగన్ బయోపిక్ మొత్తం చేస్తాడా అనేది చూడాలి.

Related Posts